Site icon NTV Telugu

West Bengal SSC Scam: కాల్ చేసిన స్పందించని దీదీ.. చేసేదేమిలేక ఈడీ వెంట చటర్జీ

West Bengal Ssc Scam

West Bengal Ssc Scam

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పశ్చిమ బెంగాల్‌ టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌లో శనివారం ఉదయం కీలక పరిణామం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఉపాధ్యాయ రిక్రూట్‌మెంట్ స్కాంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీని అరెస్టు చేసింది. మంత్రి సన్నిహితుడి నుంచి రూ.20 కోట్లు స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల తర్వాత అరెస్టు జరిగింది. కాగా.. నగదు రికవరీ కావడంతో తృణమూల్ నేతను రాత్రంతా విచారించారు. విచారణ సమయంలో ఛటర్జీ అధికారులకు సహకరించలేదు. ఈ కుంభకోణంతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పార్థ ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేసింది. అతని సన్నిహిత సహచరురాలు అర్పితా ముఖర్జీ ప్రాంగణంలో రూ.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న కేంద్ర దర్యాప్తు సంస్థ దాడుల నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది.

అయితే కుటుంబ సభ్యులకు గానీ, సంబంధీకులకు గానీ అరెస్టుకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఎవరికి ఫోన్‌ చేయాలని ఈడీ అధికారులు అడగడంతో ఆయన సీఎం మమతాకు అని సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన అర్ధరాత్రి 2.31 గంలకు, 2.33 గంటలకు, 3.37 గంటలకు, ఉదయం 9.35 గంటలకు దీదీకి ఫోన్‌ చేశారు. అయినప్పటికీ ఆ కాల్‌కు ఆమె సమాధానం ఇవ్వలేదు. అయినా చటర్జీ మరో మూడుసార్లు దీదీకి ఫోన్‌ చేసినప్పటికీ ఆమె లిఫ్ట్‌ చేయలేదు. మరో నాలుగుసార్లు ప్రయత్నించినప్పటికీ ప్లీజ్‌ ట్రై ఆఫ్టర్‌ సమ్‌ టైమ్‌ (Please try after some time) అనే సమాధానం రావడంతో.. చేసేదేమిలేక ఆయన ఈడీ అధికారుల వెంట నడిచారు.

read also: Krishna Floods: గోదావరి శాంతించింది.. కృష్ణమ్మ పరుగులు పెడుతోంది

కాగా.. ఈ మొత్తం ఎస్సెస్సీ స్కామ్‌లో వచ్చిన డబ్బుగా అధికారులు అనుమానిస్తున్నారు. అయితే అర్పితా ముఖర్జీ ఇంట్లో ఎక్కడ చూసినా రూ.500ల రూ.2 వేల నోట్ల కట్టలే దర్శనమిచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని స్కూల్ సర్వీస్ కమిషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డ్ రిక్రూట్మెంట్ స్కామ్‌ విచారణలో కీలక పత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. 20కి పైగా మొబైల్ ఫోన్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఛటర్జీతో పాటు విద్యాశాఖ సహాయ మంత్రి పరేష్‌ సి అధికారి, ఎమ్మెల్యే మాణిక్‌ భట్టాచార్య తదితరుల నివాసాలపై కూడా ఈడీ దాడులు చేసిన విషయం తెలిసిందే.

Effect of Signature on Life: సంతకం పెట్టే సమయంలో ఇలా చేస్తున్నారా..? అయితే..!

Exit mobile version