Site icon NTV Telugu

Boycott Turkey: జేఎన్‌యూ ఝలక్.. టర్కీ వర్సిటీతో ఒప్పందం రద్దు

Jnu

Jnu

ఆపదలో సాయం చేస్తే.. అపన్న హస్తం అందించిన దేశంపైనే కాలు దువ్వింది. ఇదంతా ఎవరి గురించి అంటారా? దాయాది దేశంతో చేతులు కలిపిన తుర్కియే గురించి. ఒకప్పుడు తుర్కియేలో భూకంపం సంభవిస్తే.. భారత్ అపన్న హస్తం అందించింది. అలాంటి సాయం చేసిన దేశంపై కృతజ్ఞత చూపాల్సింది పోయి.. శత్రువుతో చేతులు కలిసి భారత్‌పైనే కాలుదువ్వింది. ఈ యవ్వారం భారతీయులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ప్రజలు.. ‘బాయ్‌కాట్‌ తుర్కియే’ పిలుపునిచ్చారు. దీంతో ఇప్పటికే ఆన్‌లైన్ ఆర్డర్‌‌లు నిలిచిపోయాయి. తుర్కియే ఉత్పత్తులను భారతీయులను నిషేధిస్తున్నారు. అలాగే పర్యాటకాన్ని కూడా బహిష్కరించారు. తాజాగా జేఎన్‌యూ(జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం) చేరింది.

ఇది కూడా చదవండి: Akashteer: పాక్ గుండెల్లో ‘ఆకాష్‌టీర్’ దడ.. నిపుణుల్లో కూడా కలవరం.. అంత ప్రత్యేకత ఏంటి?

జాతీయ భద్రతా అంశాలను దృష్టిలో పెట్టుకుని జేఎన్‌యూ కీలక నిర్ణయం తీసుకుంది. టర్కీ విశ్వవిద్యాలయంతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ మేరకు జేఎన్‌యూ ఎక్స్ ట్విట్టర్‌ వేదికగా తెలిపింది. తదుపరి నోటీసు వచ్చేవరకు రద్దు అమల్లో ఉంటుందని విశ్వవిద్యాలయం వెల్లడించింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్థాన్‌కు టర్కీ మద్దతు ఇవ్వడంపై జేఎన్‌యూ ఈ నిర్ణయం తీసుకుంది. టర్కీలోని ఇనోను విశ్వవిద్యాలయంతో ఒప్పందాన్ని నిలిపివేసినట్లు పేర్కొంది.

ఇది కూడా చదవండి: Operation Sindoor: భారీగా పాక్ వైమానిక వనరులు ధ్వంసం! ఏ స్థాయిలో అంటే..!

జేఎన్‌యూ వైబ్‌సైట్ ప్రకారం ఫిబ్రవరి 3, 2025న ఇనోను విశ్వవిద్యాలయంతో జేఎన్‌యూ ఒప్పందం చేసుకుంది. ఇది మూడు సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే తాజాగా టర్కీ తీరు కారణంగా జేఎన్‌యూ ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అధ్యాపకులు మార్పిడి, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాల ప్రణాళికలు రద్దు చేసుకుంది.

 

Exit mobile version