NTV Telugu Site icon

Kalpana Soran: కేబినెట్‌లోకి కల్పనా సోరెన్.. కీలక పోస్టు దక్కే ఛాన్స్!

Soran

Soran

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం పార్టీ జయకేతనం ఎగురవేసింది. జేఎంఎం కూటమి 56 స్థానాలను కైవసం చేసుకుంది. రాష్ట్రంలో 81 స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 41 దాటుకుని విజయం సాధించింది. ఇక ముఖ్యమంత్రి హేమంత్ సతీమణి కల్పనా సోరెన్ మరోసారి విజయం సాధించారు. గతంలో జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామాతో వచ్చిన ఉపఎన్నికలో ఆమె విక్టరీ సాధించారు. తాజాగా జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలుపొందారు. గాండే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి మునియా దేవిపై 17,142 ఓట్ల తేడాతో కల్పన విజయం సాధించారు.

ఇదిలా ఉంటే కొత్తగా ఏర్పడబోయే హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో ఈసారి కల్పనా సోరెన్ కూడా అవకాశం ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. హేమంత్ సోరెన్ మనీలాండరింగ్ కేసులో అరెస్టైనప్పుడు.. ముఖ్యమంత్రిగా కల్పనను నిలబెట్టవచ్చని పొలిటికల్ సర్కిల్ వార్తలు వినిపించాయి. అయితే తోటి కోడలు సీతా సోరెన్ అడ్డుకోవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆ సమయంలో పార్టీ సీనియర్ అయిన చంపై సోరెన్‌కు ముఖ్యమంత్రి పదవికి దక్కింది. ఇక కల్పనా సోరెన్ పార్టీని భుజాన వేసుకుని చాలా తీవ్రంగా కృషి చేసింది. 200 లకు పైగా సభలు నిర్వహించి కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కల్పన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇక అధికారం రానే వచ్చింది. కల్పనకు డిప్యూటీ సీఎం పదవి లేకపోతే కీలక మంత్రి పదవి దక్కే సూచనలు ఉన్నాయని వార్తలు వినిపిస్తు్న్నాయి.