NTV Telugu Site icon

JK assembly polls: ఫ్రీగా 12 గ్యాస్‌ సిలిండర్లు, ఆర్టీసీ బస్సు.. నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టో విడుదల

Jkelection

Jkelection

దేశంలో రెండు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. జమ్మూకాశ్మీర్, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఆయా పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా ఆధ్వర్యంలో సోమవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. 12 వాగ్దానాలతో కూడిన మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ప్రధానంగా మహిళలపై వరాలు జల్లు కురిపించారు. ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ హామీలు కురిపించారు. అలాగే నెలకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ సదుపాయాన్ని కల్పించారు. మంచినీరు. నిరుద్యోగ సమస్యలను కూడా పరిష్కరిస్తామని ప్రకటించారు. ఆర్టికల్ 370తో పాటు 35ఏని పునరుద్దరిస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే రాజకీయ ఖైదీల విడుదల, లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని వరాలు కురిపించారు.

ఇది కూడా చదవండి: క్యూట్ అండ్ క్రింజ్ లవ్ స్టోరీ.. ప్రేక్షకుల్ని నవ్విస్తుంది – రమ్య పసుపులేటి ఇంటర్వ్యూ

మరిన్ని హామీలు ఇవే..
పేద మహిళలకు నెలకు రూ.5 వేలు సాయం
మాదకద్రవ్య వ్యసనానికి వ్యతిరేకంగా యుద్ధం
ప్రాణాంతక వ్యాధుల కోసం రూ.5లక్షల ఉచిత బీమా
మహిళలకు యూనివర్సిటీ వరకు.. అబ్బాయిలకు కళాశాల స్థాయి వరకు ఉచిత విద్య

జమ్మూకాశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత సెప్టెంబర్ 18న, సెకండ్ విడత 25న, మూడో విడత అక్టోబర్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 4న విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండి: Nara Lokesh: మంత్రి నారా లోకేష్‌తో ఫాక్స్‌కాన్‌ ప్రతినిధుల భేటీ