CM Nitish Kumar: బీహార్ లోని ‘మహాగటబంధన్’ కూటమిలో లుకలుకలు ఏర్పడ్డాయి. మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీపై ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ ఆరోపణలు ఎక్కుపెట్టారు. మాంఝీ కూటమి విషయాలను బీజేపీకి లీక్ చేస్తున్నట్లు ఆరోపించారు. మాంఝీని ముందు ఈ నెల 23న జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశంలో పాల్గొనాలని నితీష్ కోరారు. అయితే ఆయన ఈ సమావేశంలోని విషయాలను బీజేపీకి లీక్ చేసే అవకాశం ఉందని నితిష్ కుమార్ భయపడుతున్నారు.
Read Also: Chicken Roast : రెస్టారెంట్ స్టైల్లో చికెన్ రోస్ట్ ను ఎలా చెయ్యాలో తెలుసా?
అయితే ఈ నేపథ్యంలో జీతన్ రామ్ మాంఝీ పార్టీ హిందుస్థాని ఆవామీ మోర్చా(సెక్యులర్) పార్టీని జేడీయూలో విలీని చేయాలని ఇటీవల సీఎం నితీష్ అడిగారు. అయితే అలా కుదరదు అనడంతో, కూటమి నుంచి వైదొలగాలని చెప్పానని, ఆయన వెళ్లిపోవడం మంచిదైందని నితీష్ కుమార్ అన్నారు. మాంఝీ బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నాడని, అతను ఇటీవల పలువురు బీజేపీ నేతలను కలిశాడని, జూన్ 23న జరిగే ప్రతిపక్ష నేతల సమావేశంలో విషయాలను కూడా బీజేపీకి లీక్ చేస్తాననే భయం నాకు ఉందని నితీష్ అన్నారు. దీంతోనే అతని పార్టీని జేడీయూలో విలీనం చేయాలని కోరినట్లు ఆయన వెల్లడించారు.
ఇటీవల మాంఝీ కుమారుడు సంతోష్ కుమార్ సుమన్ రాష్ట్రమంత్రి వర్గం నుంచి రాజీనామా చేశారు. తమ పార్టీని జేడీయూలో విలీనం చేయాలనే ప్రతిపాదన తర్వాత పార్టీని కాపాడుకునేందుకు మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. మాంఝీకి జేడీయూ చాలా ఇచ్చిందని.. రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి పదవి ఇచ్చామని, ఇన్ని చేసినా ఆయన బీజేపీతో టచ్ లో ఉన్నారని అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల ముందు విపక్షాల ఐక్యత కోసం జూన్ 23న పాట్నాలో సమావేశం నిర్వహిస్తున్నారు.