Jio Happy New Year 2023 plan: మొబైల్ నెట్వర్క్ దిగ్గజం జియో అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. మరికొన్ని రోజల్లో కొత్త సంవత్సరం వస్తుండటంతో ‘జియో హ్యపీ న్యూ ఇయర్ 2023’ ఆఫర్ ను ప్రకటించింది. జియో ప్రతీ ఏడాది కొత్త సంవత్సరానికి ముందు ఇలా న్యూ ఇయర్ ఆఫర్లను ప్రకటిస్తోంది. తాజాగా తన కొత్త ఆఫర్ ను వినియోగదారులకు తెలియజేసింది. రూ. 2023తో రిఛార్జ్ తో ఈ ఆఫర్ ను తీసుకువస్తోంది. రూ.2023తో రీఛార్జ్ చేసుకుంటే 252 రోజుల వరకు అపరిమిత కాలింగ్ తో పాటు ప్రతీ రోజు 2.5 బీజీ డేటాను అందించనున్నట్లు ప్రకటించింది. రూ.2023 ప్లాన్ ప్రస్తుతం Jio.comలో అందుబాటులో ఉంది. దీంతో పాటు మై జియో యాప్, గూగుల్ పే, ఫోన్ పే, ఇతర ఏదైనా థర్డ్ పార్టీ మొబైల్ రీఛార్జ్ ఫ్లాట్ ఫారం నుంచి అయినా ఈ ఆఫర్ ను పొందవచ్చు.
Read Also: Minister KTR : ఆత్మహత్యల నుంచి దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ
ప్లాన్ వివరాలు:
రూ. 2023 ప్లాన్ 252 రోజులకు వర్తిస్తుంది. 9 నెలల పాటు అపరిమిత కాలింగ్ అందిస్తుంది. రోజుకు 2.5 బీజీ డేటా కూడా అందిస్తోంది. దాదాపుగా ప్లాన్ పూర్తి కాలంలో 630 జీబీ డేటాను పొందవచ్చు. దీంతో పాటు Jio యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. న్యూ ఇయర్ ఆఫర్ కింద, జియో కొత్త సబ్‌స్క్రైబర్‌లకు కాంప్లిమెంటరీ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను కూడా అందిస్తోంది.
కొత్తగా ప్రారంభించిన ప్లాన్ తో పాటు జియో న్యూ ఇయర్ ఆఫర్ ఇప్పటికే ఉన్న రూ. 2999 ప్లాన్ కు అదనపు ప్రయోజనాలను కూడా వర్తింపచేస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆపర్లతో పాటు రూ. 2999 ప్లాన్ 75 జీబీ అదనపు హైస్పీడ్ డేటాను 23 రోజులకు వర్తించేలా అందిస్తోంది. రూ. 2999 ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. మొత్తం 912.5GB డేటాను అందిస్తుంది, ఇది రోజుకు 2.5GB హై స్పీడ్ డేటా వస్తుంది. అదనంగా ఏడాది పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS మరియు జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.
రూ. 2874 ప్లాన్ అపరమిత కాలింగ్ తో పాటు రోజుకు 2జీబీ డేటా చొప్పున మొత్తం 730 బీజీల డేటా రోజుకు 100SMS లను, జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను 365 రోజులకు అందిస్తోంది. రూ. 2545 ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్, రోజుకు 1.5 జీబీ డేటా, మొత్తంగా 504 జీబీ డేటా, రోజుకు 100 SMS లు, జియో యాప్ లను 336 రోజులకు అందిస్తోంది.
