Site icon NTV Telugu

Dinesh Gope: మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ అరెస్ట్.. తలపై రూ.30 లక్షల రివార్డ్..

Dinesh Gope

Dinesh Gope

Dinesh Gope: ఎన్నో ఏళ్లుగా పోలీసులును, భద్రతా సంస్థల్ని ముప్పుతిప్పలు పెడుతున్న మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ దినేష్ గోపే పట్టుబడ్డాడు. ఇండియా నుంచి పారిపోయి నేపాల్ లో ఉంటున్న గోపేను జార్ఖండ్ పోలీసులు, జాతీయ భద్రత ఏజెన్సీ(ఎన్ఐఏ) జాయింట్ ఆపరేషన్ లో పట్టుబడ్డాడు. అతని తలపై రూ.30 లక్షల రివార్డ్ ఉంది. ఆదివారం నిషేధిత తీవ్రవాద సంస్థ పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎల్‌ఎఫ్‌ఐ) అధినేత దినేష్ గోప్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిని నేపాల్ నుంచి ఢిల్లీ తీసుకువస్తున్నారు.

Read Also: PM Modi: ప్రధాని మోడీ కాళ్లకు నమస్కరించిన ఆ దేశ ప్రధాని.. సంప్రదాయాన్ని పక్కకు పెట్టి ఘనస్వాగతం

గోపే తలపై మొత్తం రూ. 30 లక్షల రివార్డు ఉంది. దీంట్లో రూ.25 లక్షలు, ఎన్ఐఏ రూ. 5 లక్షలు ప్రకటించింది. గత 15 ఏళ్లుగా భారతీయ భద్రతా సంస్థలు, సీఆర్పీఎఫ్ ఫోర్స్ నక్సలైట్ దినేష్ గోపే కోసం వెతుకుతున్నాయి. దినేష్ గోపే కొన్నేళ్లుగా జార్ఖండ్‌లో తీవ్రవాద కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. అతనిపై 100కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతని సహచరుల్లో చాలా మంది ప్రస్తుతం పరారీలో ఉన్నారు. సెంట్రల్ ఏజెన్సీలు, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సహకారంలో ఈ ఆపరేషన్ జరిగింది. దినేష్ గోపే వేరే గుర్తింపుతో నేపాల్‌లో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం తన రూపాన్ని మార్చుకుని జీవిస్తున్నట్లు సమాచారం. సిక్కుగా మారువేషంలో తలపాగా ధరించి ఉన్నాడని తెలుస్తోంది.

జార్ఖండ్ లో పలు దాడులకు, హింసాత్మక సంఘటనల్లో దినేష్ గోపే హస్తం ఉంది. ఇతనిపై మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. నిరుద్యోగులైన యువకులకు ఆయుధాల వాడకంలో శిక్షణ ఇవ్వడంతో పాటు మోటార్ బైక్స్ ఇచ్చి హింసాత్మక సంఘటనల్లో పాల్గొనేలా చేశాడు. బిజినెస్ మెన్స్ ని బెదిరించి డబ్బులు వసూలు చేసిన నేరాలు కూడా ఇతడిపై ఉన్నాయి. ఇలా సంపాదించిన డబ్బును తన పీఎల్ఎఫ్ఐ మెంబర్స్ కుటుంబాల ద్వారా షెల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేలా చేశాడు. ఎక్స్‌టార్డెట్ మనీని హవాలా ద్వారా ఇతర ప్రాంతాలకు పంపాడు.

Exit mobile version