Site icon NTV Telugu

Jharkhand: హైదరాబాద్ నుంచి రాంచీకి ఎమ్మెల్యేలు.. రేపు అసెంబ్లీలో బల నిరూపణ

Jmm

Jmm

Jharkhand: జార్ఖండ్ రాజకీయాలు కీలక దశకు చేరుకున్నాయి. హేమంత్ సొరెన్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో చంపై సొరెన్ ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇదిలా ఉంటే, ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకునేందుకు సోమవారం ‘ఫ్లోర్ టెస్ట్’ ఉంది. దీంతో ఎమ్మెల్యేలంతా ఆదివారం హైదరాబాద్ నుంచి రాంచీకి బయలుదేరారు.

Read Also: HIV positive: లక్నో జైలులో హెచ్ఐవీ కలకలం.. 47 మంది ఖైదీలకు పాజిటివ్..

జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు ఉంటే అధికార జేఎంఎం-కాంగ్రెస్ కూటమికి 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మెజారిటీ మార్క్ 41, అయితే, 43 మంది ఎమ్మెల్యేల మద్దతు చంపై సొరెన్‌కి ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు, ఏజేఎస్‌యూ లేదా ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌కు ముగ్గురు ఉన్నారు. ఎన్సీపీ, ఒక లెఫ్ట్ పార్టీకి ఒక్కొక్కరు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు.

భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ సీఎంగా ఉన్న హేమంత్ సొరెన్ తన పదవికి రాజీనామా చేశారు. విచారణ అనంతరం ఈడీ ఆయనను అరెస్ట్ చేసింది. అయితే, తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుందనే కారణంలో జేఎంఎం ఎమ్మెల్యేలు హైదరాబాద్ క్యాంప్‌కి వచ్చారు. రేపు బలనిరూపన ఉండటంతో జార్ఖండ్ బయలుదేరారు.

Exit mobile version