women safty cheppal : ఈ మధ్య కాలంలో మహిళలపై దాడులు, వేధింపులు, అత్యాచారాలు, హత్యలు పెరిగి పోతున్నాయి. కొద్ది కాలంగా మహిళలపై భౌతికదాడులు పెరిగిపోతున్నాయి. మహిళలపై దాడుల సమయంలో వారిని కాపాడటానికి పోలీలుసులో.. లేకపోతే ఇతరులెవరో వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇకపై ఇతరుల అవసరం లేకుండా మహిళలను వారు వేసుకునే చెప్పులతోనే రక్షించుకోవచ్చు. అదేంటీ.. చెప్పులతో రక్షించుకోవడం ఏంటనీ ఆశ్చర్యపోతున్నారా? అవును ఇది నిజం.. ఇకపై మహిళలు వారు వేసుకునే చెప్పులతోనే రక్షించుకునేలా ఒక డివైజ్‌ను కనుగొన్నాడు ఇంటర్మీడియట్ చదివే విద్యార్థి.
ఝార్ఖండ్ లోని ఛత్రాకు చెందిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థి మంజీత్ విమెన్ సేఫ్టీ డివైజ్ పేరుతో ఎలక్ర్టిక్ చెప్పులను రూపొందించాడు. మహిళలు, బాలికలు తమపై ఎవరైనా దాడికి దిగి వేధింపులకు పాల్పడుతుంటే.. తాము వేసుకున్న ఎలక్ర్టిక్ చెప్పులతో పోకిరీలను తంతే వారికి కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే కింద పడిపోతారు. దీంతో ఇతరుల సాయం లేకుండానే వారి వారు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని ఇంటర్ విద్యార్థి మంజీత్ తెలిపారు. అయితే ఎలక్ర్టిక్ చెప్పులు అంటే వాటి విలువ ఎంతో ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తారు. కానీ కేవలం రూ. 500కే ఈ చెప్పులను కొనుగోలు చేసుకోవచ్చని చెబుతున్నాడు. సాధారణంగా మనం వేసుకునే చెప్పులనే ముడిసరుకుగా తీసుకుని అందులోని కింది భాగంలో నాలుగు బ్యాటరీలు, స్విచ్ సహా మరికొన్ని చిన్న పరికరాలను అమర్చి ఈ ఎలక్ర్టిక్ చెప్పులను తయారు చేశారు. ఈ డివైజ్‌కు అరగంట ఛార్జింగ్ పెడితే రెండు రోజుల వరకు తిరగొచ్చని మంజీత్ చెప్పారు. ఈ ఎలక్ర్టిక్ చెప్పులను తయారు చేయడానికి వారం రోజుల సమయం తీసుకున్నట్టు చెప్పారు. నిర్భయ వంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు .. మహిళలను వారిని వారే రక్షించుకునేందుకు ఈ ఎలక్ర్టిక్ చెప్పులను రూపొందించినట్టు తెలిపారు.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్