NTV Telugu Site icon

Champai Soren: జార్ఖండ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం

Champaisoren

Champaisoren

జార్ఖండ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత చంపై సోరెన్ ధీమా వ్యక్తం చేశారు. జార్ఖండ్ ఎన్నికలపై చర్చించేందుకు బీజేపీ నాయకత్వంతో చంపై సోరెన్ సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ అభ్యర్థుల జాబితా త్వరలోనే విడుదల అవుతుందని చెప్పారు. ఇక తాను కోరిన స్థానం నుంచే పోటీ చేస్తానని వెల్లడించారు. బీజేపీ అధిష్టానం.. జార్ఖండ్‌పై దృష్టి పెట్టిందన్నారు. కచ్చితంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చంపై సోరెన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Balakrishna : హీరోయిన్లకి మించిన అందం.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా బాలయ్య కుమార్తెలు

మంగళవారం మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరుగుతుండగా.. జార్ఖండ్‌లో మాత్రం రెండు విడతల్లో నవంబర్ 13, 20న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి. జార్ఖండ్‌లో 2025, జనవరి 5కి ప్రభుత్వ గడువు ముగుస్తోంది.

ఇది కూడా చదవండి: Karnataka High Court: “వక్ఫ్ బోర్డు మ్యారేజ్ సర్టిఫికేట్లు ఇవ్వడమేంటి..?” కర్ణాటక ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం..