NTV Telugu Site icon

Jennifer Mistry: ఆ నిర్మాత లైంగికంగా వేధించాడు, ఆధారాలున్నాయి.. పోలీసు కేసు నమోదు

Jennifer Mistry

Jennifer Mistry

Jennifer Mistry Said She Have Document Proof Against Producer Asith Modi: ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ షో ఎంత పాపులారిటీ గడించిందో.. ఇప్పుడు అంతే వివాదాల్లో చిక్కుకుంటోంది. ఈ షో నుంచి నటీనటులు ఒక్కొక్కరుగా బయటకు రావడమే కాదు.. నిర్మాతలపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ షో నుంచి బయటకొచ్చిన మోనికా భదోరియా, ప్రియా అహుజా, దిశా వకాని వంటి వారు.. నిర్మాతలు తమ పట్ల అమానుషంగా ప్రవర్తించారని, కనీసం రెస్ట్ కూడా ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయించుకున్నారని ఆరోపించారు. సెట్స్‌లో మగాళ్లకు ఉన్నంత మర్యాద తమకు ఇవ్వడం లేదని, వేధింపులకు గురి చేశారని మండిపడ్డారు.

Hair Care Tips: యవ్వనంలోనే మీ జుట్టు తెల్లబడుతోందా?.. ఈ నేచురల్ పద్దతులతో మీ సమస్యకు చెక్ పెట్టండి!

ఈ షో నుంచి తప్పుకున్న నటి జెన్నిఫర్ మిస్త్రీ అయితే.. నిర్మాతలతో పాటు టీం సభ్యుల్లోని కొందరు వ్యక్తులు తనని లైంగికంగా వేధించారంటూ గతంలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఈ విషయంపై ఆమె పోలీసుల్ని సంప్రదించగా.. అధికారులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆమె స్టేట్‌మెంట్‌ని రికార్డ్ చేసిన పోలీసులు.. షో నిర్మాత అసిత్ మోడీ, ఆపరేషన్స్ హెడ్ సోహైల్ రమణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత జతిన్ బజాజ్‌పై కేసు నమోదు చేశారు. ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు కానీ, దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఎట్టకేలకు చర్యలు తీసుకుంటున్నందుకు రిలీఫ్‌గా ఉందని జెన్నిఫర్ పేర్కొంది. తనకు తప్పకుండా న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని తెలిపింది. ఈ కేసులో తాను సాక్షులుగా ముగ్గురు పేర్లు ఇచ్చానని.. ఒకవేళ వాళ్లు వెనక్కు తగ్గితే, తన వద్ద డాక్యుమెంట్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయని జెన్నిఫర్ చెప్పింది.

Ashes Test 2023: యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణి.. పలు రికార్డులు బద్దలు!

అయితే.. షో నిర్మాత అసిత్ మోడీ వాదన మాత్రం మరోలా ఉంది. జెన్నిఫర్ చేసిన ఆరోపణల్ని నిరాధారమైనవని ఆయన కొట్టిపారేశారు. తన పరువు తీసేందుకు జెన్నిఫర్ ఇలా చేస్తోందని.. దీనిపై తాను చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. ఎఫ్ఐఆర్ నమోదైందన్న విషయంపై తనకు ఎలాంటి అవగాహన లేదని, ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదైతే తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయదలచుకోలేదని అన్నారు. పోలీసులు విచారణ తర్వాతే నిజాలు బయటకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.