Site icon NTV Telugu

JEE Mains Results: జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల

Jee Mains Results

Jee Mains Results

JEE Mains Results: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ 2022 (జేఈఈ మెయిన్స్ 2022) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు ప్రకటించింది. ర్యాంకులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఆదివారం కేవలం ప్రొవిజనల్‌ ఫైనల్‌ కీ మాత్రమే విడుదల చేసిన ఎన్టీఏ ఇవాళ ర్యాంకులను ప్రకటించింది. జులై 25-30 మధ్య ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు వారి ఫలితాలను చూసుకోవచ్చు. జేఈఈ మెయిన్స్‌ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in నుండి వారి స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్రవేశ పరీక్షలో 24 మంది అభ్యర్థులు 100 మార్కుల స్కోర్‌ను సాధించారు. శ్రేనిక్ మోహన్ షకీలా (మహారాష్ట్ర), నవ్య (రాజస్థాన్), శార్థక్ మహేశ్వరి (హర్యానా), క్రిషన్ శర్మ (రాజస్థాన్) ఎన్‌టీఏ విడుదల చేసిన టాపర్స్ లిస్ట్‌లో ఉన్నారు. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. పి.రవిశంకర్‌ ఆరో ర్యాంకు సాధించగా, ఎం.హిమవంశీ ఏడు, పల్లి జయలక్ష్మి తొమ్మిదో ర్యాంకు దక్కించుకున్నారు. జులైలో 6.29 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష కోసం నమోదు చేసుకున్నారు.

Venkaiah Naidu: విభజన హామీల అమలు.. వెంకయ్యనాయుడు కీలక సూచనలు

ఎన్టీఏ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో రెండు సెషన్లలో పేపర్ 1 కోసం జేఈఈ మెయిన్ ప్రవేశ పరీక్షను నిర్వహించింది. సెషన్ 1 జూన్ నెలలో (జూన్ 24-30), రెండవ సెషన్ జులై 25 నుంచి జులై 30 వరకు జరిగింది. విద్యార్థులు రెండు సెషన్లలో హాజరు కావచ్చు. తుది మెరిట్ జాబితాను సిద్ధం చేస్తున్నప్పుడు జేఈఈ మెయిన్‌లో అభ్యర్థి ఉత్తమ స్కోర్‌లను పరిగణనలోకి తీసుకుంటారు. అంతకుముందు ఆగస్టు 7న జేఈఈ మెయిన్ 2022 ఫైనల్‌ కీని విడుదల చేశారు. టాప్ 2.5 లక్షల మంది అభ్యర్థులు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ప్రవేశం కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్‌డ్ (జేఈఈ అడ్వాన్స్‌డ్) కోసం నమోదు చేసుకోవడానికి అర్హులు. జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసం దరఖాస్తు ఆగస్టు 9న ప్రారంభం కానుండగా.. పరీక్ష ఆగస్టు 28న జరగనుంది.

ఫలితాల కోసం: క్లిక్ చేయండి

Exit mobile version