NTV Telugu Site icon

Jayalalithaa Death Case: జయలలిత వైద్యంలో ఎలాంటి లోపాలు లేవు..ఎయిమ్స్ డాక్టర్స్ ప్యానెల్ రిపోర్ట్

Jayalalithaa

Jayalalithaa

Jayalalitaa was given proper treatment. Doctors Panel Report: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సరైన వైద్య చికిత్సనే అందించారని.. వైద్య విధానాల ప్రకారంమే చికిత్స చేశారని, ట్రీట్మెంట్ లో ఎలాంటి లోపాలు లేవని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యుల ప్యానెల్ నివేదిక స్పష్టం చేసింది. దీంతో ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చిన అపోలో ఆస్పత్రికి ఉపశమనం లభించినట్లు అయింది.

2016లో జయలతిత తీవ్ర అనారోగ్యంతో మరణించారు. ఆమెకు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స చేశారు. అయితే వైద్యులు ఎక్మో వంటి అత్యాధునిక వైద్యవిధానాల ద్వారా ట్రీట్మెంట్ అందించినా.. ఆమె మరణించారు. అయితే ఆమెకు జరిగిన ట్రీట్మెంట్ పై రాజకీయంగా పలు వివాదాలు చెలరేగాయి. అప్పటి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, జయలలితకు జరిగిన ట్రీట్మెంట్ పై విచారణ చేయాలని ఆరుముఘస్వామి కమిషన్‌ను ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆరుముఘస్వామి కమిషన్‌కు సహాయం చేయడానికి ఎయిమ్స్ డాక్టర్ ప్యానెల్ ను నియమించింది.

Read Also: Constable Surendra Incident: కానిస్టేబుల్ సురేంద్ర కేసు.. డీఐజీ ఏమన్నారంటే?

జయలలిత ఆరోగ్య పరిస్థితి, సంఘటనలు, చికిత్స జరిగిన తీరును ప్యానెల్ పూర్తిగా విచారించింది. అపోలో ఆస్పత్రి అందించిన చికిత్సతో పూర్తిగా ఏకీభవించింది ప్యానెల్. జయలలిత సన్నిహితులు, ఆమెకు వైద్యం అందించిన డాక్టర్లు, అప్పటి వైద్యశాఖ మంత్రి విజయభాకర్, అప్పటి ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ ఇలా ఆమె మరణంతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరిని మొత్తం 157 మందిని ఆరుముఘస్వామి కమిషన్ నవంబర్ 2017లో విచారించింది. ఇదిలా ఉంటే 2019లో అపోలో ఆస్పత్రి విచారణ ప్యానెల్ పై మధ్యంతర స్టే విధించాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ ప్యానెల్ తన నిబంధనలను దాటి వ్యవహరిస్తోందని.. ఆపోలో హాస్పిటల్స్ పై బాధ్యతను కట్టడి చేయడానికి ప్రయత్నించిందని పిటిషన్ లో పేర్కొంది. అయితే వీటిని మద్రాస్ హైకోర్ట్ తిరస్కరించింది.

ఆ తరువాత, మద్రాస్ హైకోర్ట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది అపోలో హాస్పిటల్. దీంతో జయలలితకు అందించిన చికిత్సను అర్థం చేసుకోవడాని ఎయిమ్స్ వైద్యుల ప్యానెల్ ను నియమించాలని ఆదేశించింది. వైద్య రికార్డుల ఆధారంగా.. గెండె వైఫల్యానికి సంబంధించిన రుజువులు కూడా ఉన్నాయని.. హైపర్ టెన్షన్, హైపర్ థైరాయిడ్, ఆస్తమాటిక్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ మరియు అటోపిక్ డెర్మటైటిస్ హిస్టరీ కూడా ఉందని.. హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే సమయానికి ఆమెకు షుగర్ అనియంత్రిత స్థాయిలో ఉందని గుర్తించింది. దీంతో వైద్య ప్రక్రియల్లో ఎలాంటి లోపాలు లేవని ఎయిమ్స్ మెడికల్ ప్యానెల్ రిపోర్ట్ ఇచ్చింది.