దేశ వ్యాప్తంగా వున్న జవహర్ నవోదయ విద్యాలయాల లో ఆరవ తరగతి ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి.. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 649 జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరవ తరగతి ప్రవేశాల కొరకు ఏప్రిల్ 29న పరీక్ష నిర్వహించడం జరిగింది..ఈ ప్రవేశ పరీక్ష ఫలితాల ను బుధవారం నాడు నవోదయ విద్యాలయ సమితి విడుదల చేసింది.ఈ ప్రవేశ పరీక్షలో విద్యార్థులు పొందిన మార్కుల ఆధారంగా వారి స్థానిక జిల్లాల్లో ఉన్న నవోదయ పాఠశాలల కు ఎంపిక చేయనున్నారు. ఎంపికైన విద్యార్థులకు ఆరవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఉచిత విద్య ను అందిస్తారు. మరోవైపు రాబోయే 2024-25 విద్యా సంవత్సరం కు సంబంధించి ఆరో తరగతి ప్రవేశాలకు ఇటీవలే అడ్మిషన్ నోటిఫికేషన్ ను కూడా విడుదల చేశారు.ఈ ఏడాది ఆరవ తరగతి లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్ధులు తమ రోల్ నంబర్ మరియి పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయడం ద్వారా JNVST 2023 ఫలితాలను చూసుకోవచ్చు.
జవహార్ నవోదయ విద్యాలయాల ను గ్రామీణ ప్రాంత విద్యార్థులను చదువు పై దృష్టి పెట్టే విధం గా వారిని ప్రోత్సహిస్తూ ఏర్పాటు చేసారు. ఈ పాఠశాల లలో ఎక్కువ శాతం సీట్ల ను గ్రామీణ ప్రాంత విద్యార్థుల కు ఇవ్వడం జరుగుతుంది. కొంత భాగం సీట్ల ను పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించడం జరుగుతుంది.ఈ పాఠశాలలో ప్రవేశం కోసం ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పాఠశాలలో ప్రవేశం కోసం ఎంతో మంది విద్యార్థులు పోటీ పడతారు. ఇటీవల నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరైన.విద్యార్ధులు జేఎన్‌వి అడ్మిషన్ టెస్ట్ ఫలితాలను navodaya.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. వెబ్‌సైట్ హోమ్ పేజీ లో ఉన్న రిజల్ట్స్ లింక్ ద్వారా ఫలితాల పేజీలోకి వెళ్లి ఫలితాల ను తెలుసుకోవచ్చు
