Jantar Mantar Love Story: నిరసన కోసం వస్తే వధువే దొరికింది.. పెళ్లితో ఒక్కటైన విద్యార్థులు

  • జంతర్ మంతర్ వేదికగా పెళ్లితో ఒక్కటైన జంటలు
  • నిరసనల్లో పరిచయం ప్రేమగా మారి వివాహాలు
  • సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన జంటలు
Jantar Mantar Love Story1

Jantar Mantar Love Story1

నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ పెద్ద ఎత్తున విద్యార్థులు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు చేపట్టారు. దాదాపు నెల రోజుల పాటు నిరసనలు కొనసాగించారు. దేశ నలుమూల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ జంతర్ మంతర్ దగ్గర కూర్చుని అమ్మాయిలు.. అబ్బాయిలు నెలల తరబడి ఆందోళన చేపట్టారు.

ఈ వేదికే కొందరి యువతీయువకులకు పెళ్లి చూపులయ్యాయి. నిరసనల్లో పాల్గొన్న అమ్మాయి-అబ్బాయిలు ఒకరికొకరు పరిచయం ఏర్పడడం.. కొద్ది కాలానికే ప్రేమగా మారడం పెళ్లి భాజాలకు దారి తీసింది. ఇలా ఎన్నో జంటలు మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు నడిచేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.

‘‘నేను జంతర్‌మంతర్‌లో 15 రోజుల పాటు విద్యార్థుల నిరసనలో పాల్గొన్న సమయంలో.. ఒక యువతి ప్రతిరోజూ నాకు ఏదో ఒకటి తినడానికి తీసుకొచ్చేది. అలా మెల్లగా మా మధ్య మాటలు మొదలయ్యాయి. క్రమంగా ప్రేమలో పడ్డాం. చివరకు పెళ్లి చేసుకున్నాం’’ అని బీహార్‌కు చెందిన నిరసనకారుడు తెలిపాడు. అలాగే మరో జంట కూడా నిరసనకార్యక్రమాల్లో పాల్గొనప్పుడు ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లి పీటల వరకు వెళ్లిందని చెప్పుకొచ్చారు. ఇలా పలువురు వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.