Site icon NTV Telugu

Jamshed J Irani: “స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా” జంషెడ్ జే ఇరానీ కన్నుమూత

Jj Irani

Jj Irani

Jamshed J Irani, known as Steel man of India, passes away: స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన టాటా స్టీల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, పద్మభూషన్ డాక్టర్ జంషెడ్ జే ఇరానీ కన్నుమూశారు. సోమవారం రాత్రి జంషెడ్ పూర్ లోని మరణించినట్లు టాటా స్టీల్ తెలిపింది. 86 ఏళ్ల జంషెడ్ జే ఇరానీ మరణంపై టాటా స్టీల్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. అనారోగ్యంతో చికిత్స పొందుతూ.. జంషెడ్ పూర్ లోని టాటా ఆస్పత్రిలో సోమవారం రాత్రి 10 గంటలకు మరణించారు.

43 ఏళ్ల నాటు టాటా కంపెనీలో వివిధ హోదాల్లో జేజే ఇరానీ సేవలు అందించారు. జూన్ 2011లో టాటా స్టీల్ బోర్డు నుంచి పదవీ విరమణ చేశారు. ఆయన హయాంలో టాటా స్టీల్ కంపెనీకి అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. జూన్ 2, 1936లో నాగ్ పూర్ లో జన్మించిన జేజే ఇరానీ, 1956లో నాగ్ పూర్ లోని సైన్స్ కాలేజీ నుంచి బీఎస్సీ, 1958లో నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి జియాలజీలో ఎంఎస్సీ పూర్తి చేసారు.యూకేలోని షెఫీల్డ్ నుంచి 1960లో మెటలర్జీలో మాస్టర్స్ చేశారు. 1963లో మెటలర్జీ నుంచి పీహెచ్డీ పొందారు.

Read Also: Morbi Bridge Collapse: వంతెన కూలిన ఘటనపై విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్

1963లో బ్రిటీష్ ఐరన్ అండ్ స్టీల్ రిసెర్చ్ అసోసియేషన్ లో తన కెరీర్ ప్రారంభించారు. 1968లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలో చేరేందుకు భారత్ తిరిగి వచ్చారు. టాటా స్టీలో లో అంచెలంచెలుగా తన ఎదిగారు జేజే ఇరానీ. 1978లో జనరల్ సూరింటెండెంట్గా, 1979లో జనరల్ మేనేజర్ గా, 1985లో టాటా స్టీల్ కు అధ్యక్షుడిగా, 1988లో టాటా స్టీల్ జాయింట్ మేనేజింగ్ డెరెక్టర్ గా, 1992లో ఎండీగా పనిచేసి, 2001లో పదవీ విరమణ చేశారు. టాటా స్టీల్, టాటా సన్స్, టాటా మోటార్స్, టాటా టెలి సర్వీసెస్ తో సహా టాటా గ్రూపులోని వివిధ సంస్థల్లో పనిచేశారు. 1992-93 సీసీఐ జాతీయాధ్యక్షుడిగా పనిచేశారు. 1997లో ఇండో- బ్రిటన్ ట్రేడ్ కోపరేషన్ కు చేసిన కృషికి గానూ క్వీన్ ఎలిజబెత్-2 నుంచి నైట్ హుట్ గౌరవాన్ని పొందారు.

దేశానికి చేసిన కృషికి గానూ 2007లో భారత ప్రభుత్వం పద్మభూషన్ తో సత్కరించింది. 1990లో ఆర్థిక సరలీకరణ తర్వాత టాటా స్టీల్ ను ముందంజలో ఉంచి నడిపించినందుకు భారతదేశ ఉక్కు పరిశ్రమ వృద్ధికి సహకరించినందుకు దూరదృష్టి కలిగిన నాయకుడిగా ప్రేమతో గుర్తుంచుకుంటామని టాటా స్టీల్ సంతాపాన్ని వ్యక్తం చేసింది. జేజే ఇరానీకి భార్య డైసీ ఇరానీ ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Exit mobile version