Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Jammu Records Second Highest Single Day August Rainfall In 100 Years

Jammu: జమ్మూలో కుండపోత వర్షం.. స్తంభించిన జనజీవనం.. 100 ఏళ్ల రికార్డ్ రెండోసారి బద్దలు

Published Date :August 25, 2025 , 8:47 am
By Suresh Maddala
  • జమ్మూలో కుండపోత వర్షం
  • స్తంభించిన జనజీవనం
  • 100 ఏళ్ల రికార్డ్ రెండోసారి బద్దలు
Jammu: జమ్మూలో కుండపోత వర్షం.. స్తంభించిన జనజీవనం.. 100 ఏళ్ల రికార్డ్ రెండోసారి బద్దలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

జమ్మూను భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండు రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో జమ్మూ అతలాకుతలం అయింది. భారీ వర్షం కారణంగా కథువా, సాంబా, రియాసి, ఉధంపూర్‌ సహా పలు ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. శనివారం నుంచి ఆదివారం వరకు ఏకధాటిగా వర్షం కురవడంతో 100 సంవత్సరాల్లో ఆగస్టులో రెండో అత్యధిక వర్షపాతం ఇదేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జమ్మూ నగరంలో 190.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లుగా పేర్కొన్నారు. ఆగస్టు 5న 1926న జమ్మూలో 228.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆ రికార్డ్‌ను గతంలో ఆగస్టు 11, 2022న బద్దలు కొట్టింది. అప్పుడు 189.6 మి.మీ వర్షపాతం నమోదైంది. మళ్లీ ఇప్పుడు ఇదే ఆగస్టులో 190.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక భారీ వర్షాలు కారణంగా జనజీవనం అస్తవ్యస్తం అయింది. ఇళ్లల్లోకి నీరు రావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ప్రజా రవాణా పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో అధికారులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Rekha Gupta: రేఖా గుప్తా దాడి కేసులో మరో నిందితుడు అరెస్ట్.. ఇతడేం చేశాడంటే..!

ఇక ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్ని విభాగాల అధికారులు అప్రమత్తం కావాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని.. బాధితులకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఇక జమ్మూలో చిక్కుకున్న 45 మంది విద్యార్థులను దళాలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడంతో రహదారులు మూసివేశారు. ఇక విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది.

ఇది కూడా చదవండి: Warangal: వరంగల్ లో దారుణం.. నాలుగు నెలల క్రితమే పెళ్లి.. భార్యపై దారుణం

జమ్మూ నగరంలో ప్రధాన రోడ్లన్నీ నీట మునిగాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జానిపూర్, రూప్ నగర్, తలాబ్ టిల్లో, జ్యువెల్ చౌక్, న్యూ ప్లాట్, సంజయ్ నగర్ వంటి ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించింది. ఇళ్ల సరిహద్దు గోడలు కూలిపోయాయి. దాదాపు డజను వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయని తెలుస్తోంది. తావి వంతెన సమీపంలో రోడ్డులో కొంత భాగం కుంగిపోయింది. జమ్మూ బస్టాండ్ దగ్గర ఎగ్జిట్ గేట్ కల్వర్ట్ కూలిపోయింది. వరద నీరు గ్రౌండ్ ఫ్లోర్‌లోకి ప్రవేశించడంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ హాస్టల్ నుంచి 45 మంది విద్యార్థులను రెస్క్యూ బృందాలు కాపాడాయి. ఇక మంగళవారం వరకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Rain

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 100 years
  • August rainfall
  • Heavy Rain
  • Jammu Rain
  • Jammu records

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions