Islamic body seeks ban on bhajans across schools in jammu kashmir: కాశ్మీర్ పాఠశాలల్లో శనివారం చేస్తున్న భజనలు, సూర్య నమస్కారాలు నిలిపివేయాలని ముత్తాహిదా మజ్లిస్- ఎ- ఉలేమా(ఎంఎంయూ) ప్రభుత్వం, విద్యాశాఖను కోరింది. ముస్లింల మతపరమైన భావాలు దెబ్బతింటున్న కారణంగా వీటన్నింటిని నిలపివేయాలని కోరింది. జామియా మసీద్ మతగురువు, హురియత్ ఛైర్మన్ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ నేతృత్వంలోని ఈ సంస్థ యోగా, ఉదయం ప్రార్థనల పేరుతో చట్టాలు తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.ముస్లిం విద్యార్థులు భజనలు, సూర్యనమస్కారాలు చేయాలని పాఠశాల సిబ్బంది అడుగుతున్నారని ఆరోపించింది.
పాఠశాలల్లో ముస్లిం విద్యార్థులు హిందూమతపరమైన పాటలు పాడాలని, సూర్య నమస్కారాలు చేయాలని కోరడం కాశ్మీర్ ముస్లింలను అణగదొక్కే చర్యగా వారు పేర్కొన్నారు. ఈ ఆదేశాలు మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తాయని సదరు ముస్లిం సంస్థ పేర్కొంది. ఈ వారం మొదట్లో దక్షిణ కాశ్మీర్ లో శ్రీనగర్ కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుల్గామ్ పాఠశాలలో పిల్లలతో రఘుపతి రాఘవ రాజా రామ్ భజన పాట పాడించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ వివాదం మొదలైంది.
Read Also: Woman Married Husband Friend: త్రిపుల్ తలాక్ చెప్పిన భర్తకు దిమ్మతిరిగే షాక్
బీజేపీ కాశ్మీర్ లో హిందుత్వ ఎజెండాను ముందుకు తెస్తోందని పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ విమర్శించారు. కాశ్మీర్ లో ముస్లింల గుర్తింపును బలహీనపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఎంఎంయూ విమర్శించింది. కాశ్మీర్ లో ముస్లింల మత విశ్వాసాలకు సవాలుగా నిలుస్తున్న ఇటువంటి చర్యలను సహించమని ప్రభుత్వానికి, విద్యాశాఖకు తెలియజేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇస్లాంకు వ్యతిరేకంగా పిల్లలపై ఇలాంటి చర్యలను రుద్దితే.. వారిని ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరింది ఎంఎంయూ. ముస్లిం టీచర్లు ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని తెలిపింది. కాశ్మీర్ లో మత ఛాందసవాదం పెరగడాన్ని అనుమతించబోమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్తాప్ ఠాకూర్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో జరుగుతుంది కొత్త కాదని.. భజనలపై ప్రశ్నలు లేవనెత్తే ముందు వాటిని వినండని ఆ తరువాత ప్రకటనలు చేయాలని ఎంఎంయూకు హితవు పలికారు.
