Site icon NTV Telugu

Jk: కతువాలో ఉగ్రవాదులతో కాల్పులు.. పోలీసు మృతి.. మరొకరికి గాయాలు

Jk

Jk

జమ్మూకాశ్మీర్‌లోని కతువాలో జైషే ఉగ్రవాదులతో భద్రతా బలగాలు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఒక పోలీసు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. కతువాలోని బిలావర్ ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. నలుగురు జైషే ఉగ్రవాదులను ఎదుర్కొంటున్న సమయంలో హెడ్ కానిస్టేబుల్ బషీర్ అహ్మద్ ప్రాణాలు వదలగా.. జమ్మూకాశ్మీర్‌కు చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇంకా కాల్పులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Tamil Nadu: డిప్యూటీ సీఎంగా ఉదయనిధి.. రేపే ప్రమాణస్వీకారం

జమ్మూకాశ్మీర్‌లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ జరిగింది. మూడో విడత అక్టోబర్ 1న జరగనుంది. భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. రెండు విడతల పోలింగ్ ప్రశాంతంగా జరిగాయి. మూడో విడత గందరగోళం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేశారు. దీన్ని భద్రతా బలగాలే చేధించాయి. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు బలగాలు ప్రయత్నిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Samsung Galaxy Tab S10: AI ఫీచర్లతో శాంసంగ్ కొత్త టాబ్లెట్‌లు విడుదల.. ఫీచర్లు ఇవే..!

Exit mobile version