Site icon NTV Telugu

Pahalgam terror attack: ప్రధాని మోడీతో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ..

Pm Modi

Pm Modi

Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. పహల్గామ్ ఉగ్రవాద ఘటన జరిగిన తర్వాత ఈ సమావేశం జరగడం ఆసక్తికరంగా మారింది. ఉగ్రదాడిపై ఇరువురు నేతలు చర్చించినట్లు అధికారులు తెలిపారు. ప్రధాని మోడీ నివాసంలో దాదాపు 30 నిమిషాల పాటు భేటీ కొనసాగింది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారిగా ఇరువురు నేతలు కలుసుకున్నారు.

Read Also: PM Modi: ఆస్ట్రేలియా ఎన్నికల్లో ప్రధాని ఆంథోనీ అల్బనీస్ విజయం.. పీఎం మోడీ అభినందనలు..

భారత్, పాకిస్తాన్‌పై దాడి చేస్తుందని, పీఓకేని స్వాధీనం చేసుకుంటుందనే ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యతన ఏర్పడింది. ఇటీవల, జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. పాకిస్తాన్‌కి చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా ఉన్న ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఈ దాడికి బాధ్యత ప్రకటించింది. ఈ దాడిలో పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ ప్రమేయం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
https://twitter.com/ANI/status/1918657642043433209

Exit mobile version