Site icon NTV Telugu

Terrorists Attack: మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఎస్సైపై కాల్పులు

Terror

Terror

జమ్మూకశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లలో అటు ఉగ్రవాదులు, ఇటు భద్రతాబలగాల సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామాలోని తన నివాసంలోనే ఓ ఎస్సైని కాల్చి చంపారు. మృతుడిని ఫరూక్​ అహ్మద్​ మీర్‌గా గుర్తించారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత పుల్వామా జిల్లా పాంపొర్‌లోని సంబూరా ప్రాంతంలో సబ్‌​ ఇన్​స్పెక్టర్‌పై దాడి జరిగిందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. లెథ్‌పొరా సీటీసీ ఐఆర్పీ 23వ బెటాలియన్​లో మీర్​ విధులు నిర్వర్తిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు పాల్పడినవారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

కశ్మీర్‌లో వరుసగా ఉగ్రఘాతుకాలు చోటుచేసుకుంటున్నాయి. హిందువులే లక్ష్యంగా ముష్కరులు దాడులు చేస్తున్నారు. ఈ ఘటనల్లో ఓ నటి, బ్యాంకు మేనేజర్​, జవాన్​ సహా పలువురు పౌరులు మృతిచెందారు. అనంతరం.. భద్రతా బలగాలు ఆ హత్యల్లో భాగమైన వారిని మట్టుబెట్టాయి. ఇప్పుడు మళ్లీ ఎస్సైని బలిగొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉగ్రమూకలు త‌ర‌చూ విధ్వంస‌క‌ర ఘ‌ట‌న‌లకు పాల్పడుతూ సాధారణ పౌరుల ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారు.

Heeraben Modi Birthday: శతవసంతంలోకి ప్రధాని తల్లి.. కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్న మోదీ

Exit mobile version