Congress: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.

  • డీలిమిటేషన్‌ మద్దతుపై ఊహాగానాలు..
  • క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ నేత జైరాం రమేష్..
Jairam Ramesh

Jairam Ramesh

Congress: జూలై 20న పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే, దీనికి ముందే రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా డీలిమిటేషన్ బిల్లుపై చర్చ నడుస్తోంది. ఈ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీ నేత జైరాం రమేష్ క్లారిటీ ఇచ్చారు. డీలిమిటేషన్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వదని, మీడియా నివేదికలు నిరాధారమైనవిగా పేర్కొన్నారు. కొన్ని మీడియాలు ప్రతిపక్ష వైఖరిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వార్తల్ని వ్యాప్తి చేస్తున్నాయని అన్నారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు ఆమోదానికి మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం అవుతుంది. సంఖ్యా బలం పొందడానికి మోడీ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఏప్రిల్ నెలలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ సంఖ్యా బలం లేకపోవడంతో బిల్లు వీగిపోయింది. అయితే, అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచితే మద్దతు ఇచ్చేందుకు ప్రతిపక్షాలు కూడా సిద్ధమయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి.