Bomb threats: జైపూర్, కాన్పూర్, గోవా ఎయిర్‌పోర్టులకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎయిర్ పోర్టులో బాంబులు పెట్టామనే ఈమెయిల్స్ రావడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎయిర్‌పోర్టుల్ని అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే, ఆ తర్వాత ఇవి బూటకమని తేలింది. అయితే ఎక్కడ నుంచి ఈమెయిల్స్ వచ్చాయనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు. దీనికి ముందు ఏప్రిల్ 26న కలకత్తా, జైపూర్ ఎయిర్‌పోర్టులకు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
Read Also: PM Modi: “ప్రధాని మోడీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి”.. ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే..?
గోవాలోని దబోలిమ్ విమానాశ్రయానికి వారి అధికారిక ఈమెయిల్‌కి బెదిరింపు మెయిల్ వచ్చింది. విమానాశ్రయ అధికారలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు, బాంబు స్వ్కాడ్ సోదాలు నిర్వహించారు. రాజస్థాన్‌లోని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన ఎయిపోర్ట్ డైరెక్టర్‌కు కూడా ఈ ఉదయం ఇమెయిల్ వచ్చింది. దీంతో విమానాశ్రయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని తేల్చారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న నిందితులను గుర్తించడానికి వివిధ రాష్ట్రాల అధికారులతో సమన్వయం అవుతున్నారు. మరోవైపు ఈ బెదిరింపుల కారణంగా ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ ఎయిర్ పోర్టులో భద్రతను కట్టుదిట్టం చేశారు.
