Site icon NTV Telugu

Jaishankar: బీబీసీ డాక్యుమెంటరీ.. రాజకీయ కుట్రేనన్న జైశంకర్

Jaishankar On Bbc

Jaishankar On Bbc

Jai Shankar On BBC Documentary: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై తాజాగా భారత విదేశాంగమంత్రి ఎస్‌ జైశంకర్‌ స్పందించారు. ఈ డాక్యుమెంటరీ యాదృచ్ఛికంగా చేసింది కాదని.. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన పేర్కొన్నారు. కొందరు ధైర్యం లేని వ్యక్తులు.. రాజకీయ క్షేత్రంలోకి వచ్చేందుకు మీడియా ముసుగులో ఇలాంటి పాలిటిక్స్‌ చేస్తారని అన్నారు. ఈ బీబీసీ డాక్యుమెంటరీ వెనుక అలాంటి వ్యక్తులే ఉంటారని అభిప్రాయపడ్డారు.

Heeramandi: వ్యభిచారులుగా మారిన స్టార్ హీరోయిన్లు.. ఏ రేంజ్ లో చూపిస్తారు

జైశంకర్ మాట్లాడుతూ.. ‘‘ధైర్యం లేని కొందరు వ్యక్తులు రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టేందుకు.. బీబీసీ డాక్యుమెంటరీ లాంటి ఆటలకు తెరలేపుతుంటారు. ఏదో ఒక స్వచ్ఛంద సంస్థనో లేదా మీడియా సంస్థ పేరు చెప్పి.. ఆ వ్యక్తులు ముసుగు కప్పుకుంటారు. కానీ.. వారు చేసేదంతా రాజకీయాలే! మీడియా పేరుతో ఇటువంటి వ్యవహారాలు జరుగుతూనే ఉంటాయి. విదేశాల్లో అయితే ఇలాంటివి ఇప్పటికే ఎన్నో జరిగాయి, మనం వాటిని చూశాం కూడా! ఢిల్లీలో ఎన్నికల సీజన్ మొదలైందో లేదో తెలీదు కానీ.. లండన్, న్యూయార్క్‌లో మాత్రం మొదలైంది’’ అని వెల్లడించారు. ఎవరెన్ని ప్రచారాలు చేసినా.. ప్రజలు ఇచ్చే తీర్పే ముఖ్యమని ఉద్ఘాటించారు. ఇదే సమయంలో జైశంకర్ 1984 నాటి సంఘటనల్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘డాక్యుమెంటరీ తీయాలనుకుంటే.. 1984లో ఢిల్లీలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరి వాటిపై డాక్యుమెంటరీ ఎందుకు తీయలేదు?’’ అని ప్రశ్నించారు.

Interesting Facts: మిమ్మల్ని వావ్ అనిపించే 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

ఇదిలావుండగా.. 2002లో గుజరాత్‌లో చోటుచేసుకున్న అల్లర్లకు సంబంధించి బీబీసీ సంస్థ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్‌’ పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందించింది. దీన్ని నిరోధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. ఇదే సమయంలో ముంబయి, ఢిల్లీ బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను అధికారులు సర్వే నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version