సహారా ఎడారిలో మంచు కురుస్తుందట. గత దశాబ్దాలుగా ఎడారిలో అనేక సార్లు హిమపాతం నమోదైంది. 2018లో సహారా ఎడారి పూర్తిగా తెల్లటి మంచు దుప్పటి కప్పుకుంది.
ప్రపంచంలోనే వేగవంతమైన గాలి తుఫాను బారో ద్వీపంలో గంటకు 353 మైళ్ల వేగంతో 1996లో సంభవించింది.
మీరు ఇక్కడ కోకాకోలాను కొనుగోలు చేయలేరు. ఎందుకంటే అక్కడ కోకాకోలాను అనుమతించరు. ఆ దేశాలు ఏంటంటే ఉత్తర కొరియా, క్యూబా.
పిరమిడ్లు అంటే ఈజిప్ట్ అంటాం. కానీ ప్రపంచంలోని ఇతర దేశాల కంటే సూడాన్‌లో ఎక్కువ పిరమిడ్లు ఉన్నాయంట.
మీకు రెయిన్‌బోలు ఇష్టమా? ఇప్పుడే హవాయికి వెళ్లండి. ఈ రంగురంగుల మాయాజాలం అందాన్ని చూసి మంత్రముగ్ధులవ్వడానికి ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదేశం.
ప్రపంచంలో నీటిలో మీకు ఇష్టమైన ఇంద్రధనస్సును చూడగలిగే ప్రదేశం ఒకటి ఉంది. అదే కానో క్రిస్టేల్స్. దీనిని "ఫైవ్ కలర్స్ నది" "లిక్విడ్ రెయిన్బో" లేదా "మెల్టెడ్ రెయిన్బో" అని కూడా పిలుస్తారు. కొలంబియాలోని సెరానియా డి లా మకరేనా నేషనల్ నేచురల్ పార్క్‌లో ఉంది.
మగ ఫిన్ తిమింగలాలు ఆడ సహచరులను ఆకర్షించడానికి బిగ్గరగా పాటలు పాడతాయట. ఇది నిజమేనట.
పువ్వులు కూడా రంగులు మారుస్తాయట. ఓజోన్ పొర క్షీణత వల్ల కలిగే యూవీ రేడియేషన్ పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా పువ్వులు రంగులను మారుస్తాయి. కానీ మన కళ్ళతో చూడలేము.
ప్రపంచంలో అత్యంత పురాతనమైన వృత్తి ఏది మీకు తెలుసా? అది మరేమిటో కాదు డెంటిస్ట్రీ. ఇది దాదాపు 9000 సంవత్సరాల క్రితం నాటిది.
మొత్తం ప్రపంచ జనాభా లాస్ ఏంజిల్స్ లోపల సరిపోతుంది. అధ్యయనాల ప్రకారం, జనాభాలో ప్రతి ఒక్కరూ భుజం భుజం కలిపి నిలబడితే, వారందరూ లాస్ ఏంజిల్స్‌లోని 500 చదరపు మైళ్ల లోపల సరిపోతారట.