Vice Presidential Poll: ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీయే అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్ నామినేషన్ దాఖలు చేశారు. శనివారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎన్డీయే కూటమి తరఫున అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్‌ను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన విషయం తెలిసిందే. నామినేషన్ సమయంలో ఆయనతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రం హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర బీజేపీ నేతలు హాజరయ్యారు.
రేపటితో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా ఉన్న జగదీప్ ధన్‌కర్‌ను ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జేపీ నడ్డా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తమ ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మార్గరెట్ అల్వాను బరిలో దించుతున్నట్టు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆదివారం ప్రకటించారు. ఆమె కూడా రేపు అనగా జులై 19న నామినేషన్ దాఖలు చేయనుంది.
Yashwant Sinha: ఇది కేవలం రాజకీయ పోరాటమే కాదు.. ప్రభుత్వ సంస్థలపై పోరాడుతున్నా..
1989 నుండి 1991 వరకు రాజస్థాన్‌లో ఝుంఝును నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ధన్‌కర్ పనిచేశారు. 1993 నుండి 1998 వరకు కిషన్‌నగర్ నియోజకవర్గ శాసనసభ సభ్యుడిగా పనిచేశారు.రాజస్థాన్ రాష్ట్ర న్యాయవాదుల బార్ కౌన్సిల్ సంఘానికి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాడు. 2019 జూలై 30న రాష్ట్రపతి కోవింద్‌చే పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా నియమించబడ్డారు .సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన జగదీప్ ధన్‌కర్ ఎట్టకేలకు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిచారు. భారత 16వ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఓటింగ్ ప్రక్రియ ఆగస్టు 6న జరగనుంది. అదేరోజు ఫలితాలు వెలువడుతాయి. ప్రస్తుత ఎం.వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10న ముగియనుంది. 11న కొత్త ఉప రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టనున్నారు.
Delhi | Jagdeep Dhankhar files his nomination for the Vice Presidential elections, as the candidate of NDA.
Prime Minister Narendra Modi, HM Amit Shah, Defence Minister Rajnath Singh, Union Minister Nitin Gadkari, BJP national president JP Nadda and other BJP leaders present. pic.twitter.com/iBRfuXC0pO
— ANI (@ANI) July 18, 2022