ITBP Jawan: జమ్మూ కశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో ఓ ఐటీబీపీ జవాన్ తన ముగ్గురు సహోద్యోగులపై కాల్పులు జరిపాడు. అనంతరం అతడు కూడా కాల్చుకుని అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. జిల్లాలోని దేవిక ఘాట్ కమ్యూనిటీ సెంటర్ వద్ద శనివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు జవాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు పాల్పడిన జవానును భూపేంద్ర సింగ్‌గా గుర్తించారు. ఈ కాల్పుల ఘటనలో ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారికి ప్రాణాపాయం లేదని ఓ అధికారి తెలిపారు.
Tribute for Reporter Zameer : రిపోర్ట్ జమీర్‌కు నివాళులు అర్పించిన పాత్రికేయులు..
భూపేంద్ర సింగ్ 8వ బెటాలియన్‌కు చెందినవాడని వివరించారు. ప్రస్తుతం అతడు జమ్ముకశ్మీర్‌లోని తాత్కాలిక బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడని చెప్పారు. ఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు.ఇటీవలే ఎఫ్ కంపెనీకి చెందిన రెండో అడ్ హాక్ బెటాలియన్‌కు డిప్యుటేషన్‌పై వచ్చాడు. కాగా, అతడు ఎందుకు సహచరులపై కాల్పులు జరిపి, తాను ఆత్మహత్య చేసుకున్నాడన్న దానిపై ఐటీబీపీ విచారణ (కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ)కు ఆదేశించింది.
