Site icon NTV Telugu

Giorgia Meloni: ప్రపంచ నేతల్ని “నమస్తే”తో పలకరించిన ఇటలీ పీఎం జార్జియా మెలోని.. మీమ్స్‌తో నెటిజన్ల రచ్చ..

Italy Pm Giorgia Meloni

Italy Pm Giorgia Meloni

Giorgia Meloni: ఇటలీ వేదికగా జీ-7 సదస్సు జరగబోతోంది. జూన్ 13-14 తేదీల్లో అపులియాలో ఈ సమ్మిట్ జరగబోతోంది. జీ-7లో గ్రూప్‌లోని అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, యూకే దేశాధినేతలు ఇప్పటికే ఇటలీ చేరుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్వయంగా ఆహ్వానించారు. పీఎం మోడీ కూడా ఈరోజు ఇటలీ బయలుదేరారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ తన తొలి విదేశీ పర్యటనకు ఇటలీని ఎంచుకున్నారు.

Read Also: Video: అమిటీ యూనివర్శిటీలో బాలికపై దాడి.. పోలీసుల దర్యాప్తు

ఇదిలా ఉంటే, ప్రపంచ దేశాధినేతల్ని, ప్రపంచస్థాయి సంస్థల అధిపతుల్ని స్వయంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. అయితే, ప్రస్తుతం ఆమె ఆహ్వానించిన పద్ధతి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతీయ సంప్రదాయమైన ‘‘నమస్తే’’తో వివిధ దేశాధినేతల్ని ఆహ్వానిస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. గతంలో ప్రధాని నరేంద్రమోడీ, జార్జియా మెలోనికి సంబంధించిన మీమ్స్ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి జార్జియా మెలోనీ నమస్తే పలకరింపుతో వైరల్ అయ్యారు.

దీనిపై నెటిజన్లు తెగ రెస్పాండ్ అవుతున్నారు. వివిధ రకాల మీమ్స్‌తో స్పందిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు మెలోని నెటిజన్లు జార్జియా మెలోనీ నమస్తేతో పలకరిస్తున్న వీడియోలను పాయింట్ చేశారు.

Exit mobile version