NTV Telugu Site icon

Rahul Gandhi: నాకే ఎక్కువ శిక్ష పడింది.. ఇలా జరుగుతుందని ఊహించ లేదు

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పరువు నష్టం కేసుపై స్పందించారు. అది ఇండియాలో కాదు.. అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో మాట్లాడారు. ఇండియాలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలను తాను 2000లో రాజకీయాల్లోకి వచ్చినపుడు అసలు ఊహించలేదన్నారు. పరువు నష్టం కేసులో గరిష్ఠ శిక్షను బహాశా తనకే విధించి ఉంటారని అన్నారు. తన పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారన్నారు. అది అసలు ఊహించలేదనని అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో జరిగిన కార్యక్రమంలో రాహుల్‌ అన్నారు.

రాహుల్ గాంధీ అమెరికా పర్యటన మంగళవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆయన శాన్‌ఫ్రాన్సిస్కోలో భారతీయ మూలాలు గలవారితో బుధవారం మాట్లాడుతూ దేవుడి పక్కన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూర్చోబెడితే.. ఈ విశ్వం ఎలా పని చేస్తోందో దేవుడికి మోదీ వివరిస్తారన్నారు. తాను సృష్టించినదేమిటి? అని దేవుడు అయోమయంలో పడతాడన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీ విదేశాల్లో ఉంటే ఆయనకు జిన్నా ఆత్మ ఆవహిస్తుందని దుయ్యబట్టింది. రాహుల్ గురువారం స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో జరుగుతున్నదానిని తాను 2004లో రాజకీయాల్లో చేరినపుడు ఊహించలేదన్నారు. పరువు నష్టం కేసులో గరిష్ఠ శిక్ష బహుశా తనకు మాత్రమే విధించి ఉంటారన్నారు. ఇలాంటి చర్యలు సాధ్యమవుతాయని తాను ఎన్నడూ ఊహించలేదన్నారు. అయితే తన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం వల్ల పార్లమెంటులో కూర్చోవడం కంగే కూడా భారత్ జోడో యాత్ర సందర్భంగా తనకు లభించిందన్నారు.

భారత దేశంలోని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణపడుతున్నాయన్నారు. దేశంలోని వ్యవస్థలను బీజేపీ కబ్జా చేసిందని విమర్శించారు. తాము బీజేపీతో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్నామని చెప్పారు. వ్యవస్థలు తమకు సహాయపడటం లేదని గుర్తించిన తరువాతనే.. తాము రోడ్లపైకి వచ్చామని.. భారత్ జోడో యాత్ర నిర్వహించామని చెప్పారు. స్వదేశంలో పరిస్థితులను చక్కదిద్దడానికి విదేశీ సాయం కోరుతున్నారా? అని అడిగినపుడు రాహుల్ స్పందిస్తూ.. తాను ఎవరి సహకారాన్ని కోరడం లేదన్నారు. మా పోరాటం మాదేననే స్పష్టత తనకు ఉందన్నారు. అయితే భారత దేశం నుంచి వచ్చిన యువ విద్యార్థులు అమెరికాలో ఉన్నారని, వారికి ఈ వివరాలను చెప్పాలని తాను అనుకుంటున్నానని.. అది తన హక్కు అని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రజలతో మాట్లాడాలని, వారడిగే కఠిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని రాహుల్‌ గాంధీ డిమాండ్ చేశారు.

రాహుల్‌పై పరువు నష్టం కేసు
కర్ణాటకలో 2019లో జరిగిన ఒక ఎన్నికల బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ దొంగల ఇంటిపేరు మోదీ ఎందుకు అవుతుందోనని ప్రశ్నించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. విచారణ జరిపిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీ దోషి అని నిర్థారించి, రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్పు తీర్పు నేపథ్యంలో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని లోక్‌సభ సచివాలయం రద్దు చేసింది. ఆయన కేరళలోని వయనాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా 2019లో గెలిచిన సంగతి తెలిసిందే.
IPL: ఐపీఎల్‌ చూడ్డం టైమ్‌ వేస్ట్‌ : స్టార్టప్ ఫౌండ‌ర్‌ తనయ్ ప్రతాప్‌

Show comments