Site icon NTV Telugu

Tamilnadu-IT Raids: కోలీవుడ్ పై ఐటీ రైడ్స్.. రూ. 200 కోట్లు గుర్తింపు

It Raids In Tamilnadu

It Raids In Tamilnadu

Tamilnadu-IT Raids: కోలీవుడ్ టార్గెట్ గా ఐటీ శాఖ ఇటీవల తమిళనాడు వ్యాప్తంగా దాడులు చేసింది. ఏక కాలంలో 40 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్ల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. ఆగస్టు 2న నిర్వహించిన సోదాల్లో లెక్కలోకి రాని లావాదేవీలు, పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేస్తున్నారు. సోదాల సమయంలో పలు రహస్య ప్రాంతాలను గుర్తించింది. ఈ విషయాన్ని శనివారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ( సీబీడీటీ) ప్రకటించింది.

కోలీవుడ్ నిర్మాతలు, ఇతర వ్యక్తులకు సంబంధించి చెన్నై, మధురై, కోయంబత్తూర్, వెల్లూర్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అయితే ఈ సోదాల్లో దాదాపుగా రూ.200 కోట్లకు పైగా అక్రమ ఆదాయాన్ని గుర్తించారు. వీటన్నింటిని ఆప్రకటిత ఆదాయం గుర్తించారు. రూ. 26 కోట్ల నగదుతో పాటు రూ. 3 కోట్ల విలువైన బంగారాన్ని ఐటీ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకున్నాయి. తదుపరి విచారణ కొనసాగుతుందని సీబీడీటీ అధికారులు వెల్లడించారు.

Read Also: CM KCR-NITI Aayog: నేతి బీరకాయలో నెయ్యి ఎంతుంటదో నీతి ఆయోగ్‌లో నీతీ అంతే ఉంది: సీఎం కేసీఆర్‌

అయితే, ఆదాయపు పన్ను శాఖ వెల్లడించని ఆదాయాన్ని కలిగి ఉన్న నిర్మాతలు లేదా ఫైనాన్షియర్‌ల పేర్లను పేర్కొనలేదు. గత మంగళవారం చెన్నైలోని స్టూడియో గ్రీన్ కు చెందిన జ్ఞానవేల్ రాజా, కలైపులి ఫల్మ్స్ ఇంటర్నేషనల్ కు చెందిన కలైపులి థాను, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అధినేత ఎస్ ఆర్ ప్రభు, గోపురం ఫిలింస్ కు చెందిన అన్బు చెజియన్ సహా మరికొంత మంది ప్రముఖ సినిమా ఫైనాన్షియర్లకు సంబంధించిన కార్యాలయాలు, ఇళ్లపై ఆదాయపన్నుల శాఖ దాడులు చేసింది.

Exit mobile version