NTV Telugu Site icon

Mehbooba Mufti: అడాల్ఫ్‌ హిట్లర్‌ తర్వాత నెతన్యాహునే అతిపెద్ద ఉగ్రవాది..

Mufti

Mufti

Mehbooba Mufti: ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుపై పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అడాల్ఫ్‌ హిట్లర్‌ తర్వాత నెతన్యాహునే అతి పెద్ద ఉగ్రవాది అని అభివర్ణించింది. ఈరోజు (సోమవారం) జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ప్రజలను చంపడానికి హిట్లర్ గ్యాస్ చాంబర్‌లను ఏర్పాటు చేయగా.. నెతన్యాహు మాత్రం పాలస్తీనా, లెబనాన్‌లనే గ్యాస్ చాంబర్లుగా మార్చేశాడని మండిపడింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ఇజ్రెయల్ ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా తీర్పును ఇచ్చిందని ముఫ్తీ గుర్తు చేసింది.

Read Also: Small savings schemes: చిన్న మొత్తాలపై పాత వడ్డీ రేట్లే.. కేంద్రం ప్రకటన

ఇక, పాలస్తీనాలో వేల మందిని చంపారు.. ఇప్పుడు లెబనాన్‌లోనూ అదే తరహా పరిస్థితులను సృష్టిస్తున్నారని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ తెలిపారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. మహత్మా గాంధీ కాలం నుంచి పాలస్తీనాకు తాము అండగా ఉన్నామని ముఫ్తీ గుర్తు చేసింది. హత్యకు గురైన హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లాను అమరవీరుడుగా అభివర్ణిస్తూ ముఫ్తీ ట్వీట్ చేయగా దానిపై భారతీయ జనతాపార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. దీనిపై కూడా ఆమె తాజాగా రియాక్ట్ అయింది. పాలస్తీనా ప్రజల కోసం నస్రల్లా చేసిన సుదీర్ఘ పోరాటం గురించి బీజేపీకి తెలియదని మెహబూబా ముఫ్తీ ఎద్దేవా చేశారు.

Show comments