Gaza War: దక్షిణ గాజాలోని రఫా ప్రాంతంలో హమాస్ సొరంగాల్లో ఆరుగురు ఇజ్రాయిలీ బందీల మృతదేహాలను ఇజ్రాయిల్ ఆర్మీ స్వాధీనం చేసుకున్నట్లు ఆదివారం తెలిపింది. చనిపోయిన బందీలను కార్మెల్ గాట్, ఈడెన్ యెరుషల్మి, హెర్ష్ గోల్డ్‌బెర్గ్-పోలిన్, అలెగ్జాండర్ లోబనోవ్, అల్మోగ్ సరుసి మరియు ఒరి డానినోగా గుర్తించారు. అక్టోబర్ 07నాటి హమాస్ దాడి సమయంలో వీరిని అపహరించుకెళ్లారు. మృతదేహాలను ఇజ్రాయిల్ తీసుకువచ్చినట్లు ఐడీఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also: Hyderabad-Vijayawada highway Closed: హైదరాబాద్- విజయవాడ మధ్య రాకపోకలు బంద్..
‘‘మా ప్రాథమిక అంచనా ప్రకారం.. మేము వారిని చేరుకోవడానికి కొద్దిసేపటికే హమాస్ ఉగ్రవాదులు వారిని దారుణంగా హత్య చేశారు.’’ అని సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి మీడియా సమావేశంలో చెప్పారు. దక్షిణ గాజాలోని భూగర్భ సొరంగం నుంచి ఇజ్రాయిటీ బందీగా ఉన్న ఏళ్ల ఖైద్ ఫర్హాన్ అల్కాడిని సైన్యం రక్షించిన కొన్ని రోజులు తర్వాత ఈ ఘటన జరిగింది. గాజాలోని కనుగొన్న ఆరుగురు మృతదేహాల్లో ఇజ్రాయిల్ అమెరికన్ హెర్ష్ గోల్డ్‌బెర్గ్-పొలిన్ ఉన్నాడని చెప్పారు.
గతేడాది అక్టోబర్ 07న హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయిల్‌పై మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో 1200 మంది మరణించగా, 251 మందిని బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు. గతేడాది చివర్లో జరిగిన కాల్పుల విరమణ సమయంలో 100 మంది బందీలను హమాస్ విడిచిపెట్టింది. మిగిలిన వారిలో కొంత మంది గాజా యుద్ధంలో మరణించగా, మరికొందరు ఇంకా హమాస్ చేతుల్లోనే బందీలుగా ఉన్నారు. అక్టోబర్ 07న సూపర్‌నోవ మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి అపహరణకు గురైన గోల్డ్‌బెర్గ్-పోలిన్ తల్లిదండ్రులు గత నెలలో చికాగోలో జరిగిన డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు.