NTV Telugu Site icon

Ghibli: మోడీ, నెతన్యాహూ “ఘిబ్లీ” ఇమేజ్ వైరల్.. షేర్ చేసిన ఇజ్రాయిల్..

Pm Modi

Pm Modi

Ghibli: భారత్, ఇజ్రాయిల్ మధ్య స్నేహానికి గుర్తుగా ఇండియాలోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం ప్రధాని నరేంద్ర మోడీ, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూల ‘‘ఘిబ్లీ’’ ఇమేజ్‌లను షేర్ చేసింది. మార్చి 31న ప్రధాని మోడీ, నెతన్యాహూల ఫోటోని ఇజ్రాయిల్‌లోని భారత రాయబార కార్యాలయం పోస్ట్ చేసింది. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం నుంచి ఈ పోస్ట్ వచ్చింది.

Read Also: Vaani Kapoor : వయ్యారాలు ఒలకబోస్తున్న వాణి కపూర్

2018లో ప్రధాని మోడీ ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఇద్దరు నేతలు కలిసి సముద్రం తీరంలో జీపులో ప్రయాణించారు. ఈ ఫోటోని షేర్ చేసిన ఇజ్రాయిల్‌లోని భారత రాయబార కార్యాలయం..‘‘ భారత్-ఇజ్రాయిల్ స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లడం’’ అని కామెంట్ చేసింది.

ఇటీవల ఘిబ్లీ చిత్రాలు సోషల్ మీడియాలో తుఫానుగా మారాయి. ప్రముఖులు, రాజకీయ నాయకులతో పాటు నెటిజన్లు తమ ఫోటోలను ఘిబ్లీ ఇమేజ్‌లుగా మార్చడానికి ఏఐ టూల్ చాట్‌జీపీటిని ఉపయోగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ తన ఏఐ ఫ్లాట్‌ఫామ్‌లో ఘిబ్లీ ఇమేజులకు పెరుగుతున్న ట్రెండ్స్‌ని ఆందోళన వ్యక్తం చేశారు. ఘిబ్లీ ట్రెండ్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంతో, తమ సిబ్బందికి నిద్ర అవసరం అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.