Site icon NTV Telugu

ISKCON: ఇస్కాన్ రెస్టారెంట్‌లో కావాలని చికెన్ తిన్న వ్యక్తి.. హిందువుల ఆగ్రహం..

Iscon

Iscon

ISKCON: లండన్ లోని ఇస్కాన్ గోవింద రెస్టారెంట్‌లో షాకింగ్ సంఘటన జరిగింది. ప్రసిద్ధ శాఖాహార సంస్థగా పేరున్న ఈ రెస్టారెంట్‌లోకి ఆఫ్రికా సంతతికి చెందిన ఒక బ్రిటిష్ వ్యక్తి మాంసం తీసుకువచ్చి తిన్నాడు. కావాలని కేఎఫ్‌సీ చికెన్ తీసుకువచ్చి రెస్టారెంట్‌లో గలాటా చేశాడు. రెస్టారెంట్‌లో కేవలం శాఖాహారం మాత్రమే వడ్డిస్తారని తెలియగానే, కావాలనే తన చేతిలో ఉన్న బకెట్ నుంచి చికెన్ ముక్కలు తీసి తినడం ప్రారంభించారు. రెస్టారెంట్‌లో పనిచేసే వ్యక్తులు ఎంత వారిస్తున్నా, వినకుండా అక్కడ ఉన్న కస్టమర్లు, సిబ్బందిని అసహనానికి గురిచేశాడు. పరిస్థితి తీవ్రం కావడంతో సిబ్బంది అతడిని బయటకు తోసేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అయింది. ఈ చర్యను జాత్యహంకారం, మత అసహనంతో ప్రేరేపించబడిందని పలువురు కామెంట్స్ చేశారు.

ఈ ఆఫ్రికన్-బ్రిటిష్ యువకుడు ఇస్కాన్ గోవింద రెస్టారెంట్‌లోకి ప్రవేశించాడు – అది స్వచ్ఛమైన వెజ్ రెస్టారెంట్ అని తెలిసి కూడా – మాంసం అందుబాటులో ఉందా అని అడిగాడు, ఆపై తన KFC బాక్స్‌ను తీసి చికెన్ తిన్నాడు అని ఒక వ్యక్తి కామెంట్స్ చేశాడు. దీనిని నైతిక నిర్లక్ష్యంగా మరొక నెటిజన్ ఆరోపించాడు. జాత్యాంహకార చర్యలకు పాల్పడినట్లు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Brain Tumor Risk: బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది..?

“అతను ప్రజలను వేధించడం ద్వారా ఏమీ సాధించలేదు! విజయం శూన్యం కానీ సమాజంలో చికాకును సృష్టించాడు.” అని ఒక యూజర్ పోస్ట్ చేశాడు.

“స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేయబడిందని ఆశిస్తున్నాను… దీనికి అతన్ని అరెస్టు చేయవచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఇది హిందువుల పట్ల పూర్తిగా ద్వేషం, హిందువులు ప్రతీకారం తీర్చుకోరని అతనికి పూర్తిగా తెలుసు, అందుకే అతను ఇంత భయంకరమైన పని చేయడానికి ధైర్యం చేశాడు” అని మరొకరు వ్యాఖ్యానించారు.

“ఈ విధంగా సాంస్కృతిక, మతపరమైన నియమాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం అనేది ఏ నాగరిక సమాజంలోనూ సహించలేని అసహనానికి స్పష్టమైన నిదర్శనం” మరొకరు కామెంట్ చేశారు.

Exit mobile version