NTV Telugu Site icon

Congress: ‘‘ మోడీకి చట్టం వర్తించదా..?’’ ధ్యానం ఫోటోపై దిగ్విజయ్ సింగ్ ఫైర్..

Pm Modi

Pm Modi

Congress: ప్రధాని నరేంద్రమోడీ ధ్యానంపై కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఏడో దశ ఎన్నికల ప్రచారం ముగిసిన కొద్ది గంటల తర్వాత మే 30న ప్రధాని మోడీ కన్యాకుమారికి వెళ్లారు. అక్కడే 45 గంటలపాటు ధ్యానం చేశారు. ఒకప్పుడు స్వామి వివేకానంద ధాన్యం చేసిన ‘‘వివేకానంద మెమోరియల్’’ స్థలంలో ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే, ఎన్నికల ముందు ఇలా చేయడంపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. ఈ రోజు ప్రధాని మోడీ తన ధ్యానాన్ని ముగించారు.ఢిల్లీకి పయణమయ్యారు.

Read Also: Yadadri Thermal Power Plant: యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణంలో అవకతవకలపై ఎంక్వైరీ స్పీడప్

ఇదిలా ఉంటే, తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మోడీ ధ్యానంపై ఫైర్ అయ్యారు. వివేకానంద మెమోరియల్‌‌లో ఫోటోగ్రఫీకి అనుమతి లేదని ఆయన అన్నారు. కానీ మోడీ ధ్యానం చేస్తున్న ఫోటోలు బయటకు రావడంపై అభ్యంతరం తెలిపారు. మోడీకి చట్టం, నిబంధనలు వర్తించవా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై స్పందించాల్సిందిగా ప్రధాని కార్యాలయాన్ని(పీఎంఓ)ని కోరారు.

కపిల్ అనే యూజర్ ప్రధాని ధ్యానాన్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘‘ఇక్కడ ఫోటోగ్రఫీకి అనుమతి లేదు మరియు చట్టం ద్వారా శిక్షార్హమైనది కాబట్టి మీరు వివేకానంద మెమోరియల్ లోపల ధ్యాన మందిరం ఫోటోలను చూడటం ఇదే మొదటిసారి.’’ ‘‘కెమెరా-జీవి’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘వివేకానంద రాక్ మెమోరియల్‌ని సందర్శించడానికి ఫోటోగ్రఫీ నియమాలు కఠినమైనవి మరియు పరిమితం చేయబడ్డాయి, ఎందుకంటే ఇది రక్షిత మరియు సున్నితమైన ప్రాంతం. మీరు ఫోటోలు లేదా వీడియోలు తీయడానికి అనుమతి లేదు. స్మారక చిహ్నం లోపల, మీరు స్మారక చిహ్నం వెలుపల నుండి లేదా ఫెర్రీ నుండి మాత్రమే ఫోటోలు లేదా వీడియోలను తీయవచ్చు, మీరు ఇతర సందర్శకుల గోప్యత మరియు గౌరవాన్ని కూడా గౌరవించాలి మీ కెమెరాతో వారిని ఇబ్బంది పెట్టవద్దు లేదా వేధించవద్దు.’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ విషయాన్నే దిగ్విజయ్ సింగ్ హైలెట్ చేశారు.