NTV Telugu Site icon

Palestine: పాలస్తీనాను దేశంగా గుర్తించిన ఐర్లాండ్, నార్వే, స్పెయిన్.. ఇజ్రాయిల్ కీలక నిర్ణయం..

Palestine

Palestine

Palestine: ఇజ్రాయిల్‌కి వ్యతిరేకంగా పాలస్తీనాకు మద్దతుగా పాశ్చాత్య దేశాలు కీలక ఎత్తుగడను తీసుకున్నాయి. ఇప్పటికే అమెరికా, ఇతర యూరప్ దేశాల్లో పాలస్తీనాకు మద్దతుగా విద్యార్థులు పలు యూనివర్సిటీల్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ఐర్లాండ్, నార్వే,స్పెయిన్ దేశాలు పాలస్తానాను అధికారికంగా ఒక దేశంగా గుర్తించాయి. గాజాలో ఇజ్రాయిల్-హమాస్ మిలిటెంట్లకు తీవ్రంగా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. ఈ నిర్ణయంపై ఇజ్రాయిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఐర్లాండ్, నార్వేల్లోని తన రాయబారుల్ని వెంటనే వెనక్కి రావల్సిందిగా ఆదేశించింది.

Read Also: ACP Uma Maheswara Rao: ఉమామహేశ్వర్ ఏసీబీ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులతోనే బినామీ వ్యాపారాలు

బుధవారం ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయిల్ కాట్జ్ మాట్లాడుతూ..‘‘ నేను ఐర్లాండ్, నార్వేలకు స్పష్టమైన, నిస్సందేహమైన సందేశాన్ని పంపుతున్నాను. ఇజ్రాయిల్ తన సార్వభౌమత్వాన్ని బలహీనపరిచే, దాని భద్రతకు అపాయం కలిగించే వారి పట్ల మౌనంగా ఉండదు’’ అని అన్నారు. పాలస్తానాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తూ ఆ దేశాలు తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో ఐర్లాండ్, నార్వేలోని ఇజ్రాయిల్ రాయబారుల్ని తక్షణమే రీకాల్ చేయాల్సిందిగా ఆదేశించినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ మాట్లాడుతూ మే 28 నుంచి తమ దేశం కూడా పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించిందన్నారు, అయితే దీనిపై స్పెయిన్‌కి ఇజ్రాయిల్ వార్నింగ్ ఇచ్చింది.

‘‘ఐరిష్- నార్వేజియన్ మూర్ఖత్వం మమ్మల్ని నిరోధించలేదు. మా లక్ష్యలాను సాధించాలని నిర్ణయించుకున్నాము. మా పౌరుల భద్రతను పునరుద్ధరించడం, హమాస్‌ని కూల్చివేయడం, బందీలను ఇంటికి తీసుకురావడం మా లక్ష్యం, వీటి కంటే న్యాయమైన కారణాలు లేవు’’ అని ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి అన్నారు. అయితే, మధ్యప్రాచ్యంలో శాంతికి తమ నిర్ణయం దోహదపడుతుందని పాలస్తీనాను దేశంగా గుర్తించిన నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ దేశాలు చెబుతున్నాయి. మరోవైపు యూరోపియన్ యూనియన్ దేశాలు స్లోవేకియా, మల్టాలు కూడా శాశ్వత శాంతి కోసం రెండు-దేశాల పరిష్కారం అవసమని చెప్పింది. ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్యదేశాలలో మొత్తం 143 పాలస్తీనా దేశాన్ని గుర్తించాయి. పాలస్తీనా రాజ్యాన్ని అధికారికంగా గుర్తించని దేశాలలో UK మరియు US ఉన్నాయి.