Site icon NTV Telugu

Manipur: మణిపూర్‌లో మరోసారి హైటెన్షన్.. ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్

Manipur

Manipur

Manipur: మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో మరోసారి హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. కుకీ, మైటీ వర్గాల మధ్య ఘర్షణలతో భద్రతా బలగాలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. అయితే, శనివారం రాత్రి అరంబై టెంగోల్ సభ్యుడిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనలకు దిగారు. రోడ్లపై టైర్లను తగులబెట్టి, ఏటీ నాయకుడు కనన్ సింగ్ అరెస్టుకు వ్యతిరేకంగా యువకులు, మైటీ స్వచ్ఛంద సేవకులే నిరసనలకు దిగారు. జాతి ఘర్షణలు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు తమ గ్రామాలపై దాడి చేశారని కుకీ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. ఇంఫాల్‌లోని క్వాకీథెల్ ప్రాంతంలో కాల్పుల శబ్దం వినిపించిందని స్థానికులు తెలిపారు.

Read Also: Jayashankar Bhupalpally: గోదావరి నదిలో ఆరుగురు యువకులు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

అయితే, మైటీ గ్రూప్ అరంబై టెంగోల్ నాయకుడిని అరెస్టు చేసిన తరువాత శాంతిభద్రతల సమస్యలను ఏర్పడే అవకాశం ఉందని మణిపూర్ ప్రభుత్వం శనివారం రాత్రి 11:45 గంటల నుంచి ఐదు రోజుల పాటు ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, తౌబాల్, బిష్ణుపూర్ మరియు కాక్చింగ్ ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. అలాగే, కమిషనర్-కమ్-సెక్రటరీ (హోం) ఎన్ అశోక్ కుమార్ జారీ చేసిన అదేశాల ప్రకారం.. సామాజిక వ్యతిరేక శక్తులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను దుర్వినియోగం చేసి ద్వేషపూరిత సందేశాలు, రెచ్చగొట్టే చిత్రాలు, వీడియోలను వ్యాప్తి చేస్తారనే ఉద్దశ్యంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Exit mobile version