GST Removal on helmets: రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలతో బయటపడాలంటే హెల్మెట్లు ఎంతో అవసరం.. ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేసేవారికి హెల్మెట్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం.. బైక్ నడిపేవారు మాత్రమే కాదు.. వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సింది.. ఈ నిబంధనలు ఇప్పుడు కొన్ని నగరాలకే పరిమితం అయ్యాయి.. అయితే, రోడ్డు ప్రమాదాలు జరిగినా.. ప్రాణాలతో బయటపడ్డారంటే.. వాళ్లు హెల్మెట్ ధరించినవారే ఉంటున్నారు.. అయితే, హెల్మెట్‌లపై విధించిన జీఎస్టీని తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది అంతర్జాతీయ రహదారి సమాఖ్య (ఐఆర్‌ఎఫ్).. ప్రస్తుతం హెల్మెట్‌లపై 18 శాతం జీఎస్టీ విధిస్తుండగా.. దానిని పూర్తిగా ఎత్తివేయాలని కోరింది..
Read Also: Ramgopalpet Fire Accident: అదుపులోకి రాని మంటలు.. భవనం కూల్చివేసేందుకు..
ఈ మేరకు ఐఆర్‌ఎఫ్… కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది.. రాబోయే కేంద్ర బడ్జెట్ 2023లో ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం లైఫ్ సేవింగ్ డివైజ్ హెల్మెట్‌లపై జీఎస్టీని తొలగించాలని.. ప్రస్తుతం ఉన్న 18 శాతం నుంచి 0 శాతానికి తగ్గించాలని కోరింది.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాబోయే కేంద్ర బడ్జెట్‌లో హెల్మెట్‌లపై విధించిన వస్తు సేవల పన్ను (జీఎస్‌టీని) తొలగించాలని ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ (ఐఆర్‌ఎఫ్) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రపంచవ్యాప్తంగా సంభవించే రోడ్డు ప్రమాద మరణాలలో భారత్‌లో 11 శాతం జరుగుతున్నాయని ఐఆర్‌ఎఫ్ ఎమెరిటస్ ప్రెసిడెంట్ కేకే కపిల ఈ సందర్భంగా పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారుల విషయంలో ఇది దాదాపు 31.4 శాతంగా ఉందన్నారు. ద్విచక్ర వాహన ప్రమాద గాయాలు మరియు మరణాలను తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన చర్యలలో ఒకటి ప్రామాణిక హెల్మెట్‌ల వాడకం అని ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో తెలిపారు కేకే కపిల.