పహల్గామ్ ఉగ్రదాడి యావత్తు ప్రపంచాన్ని నిర్ఘాంతపరిచింది. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ముష్కరులు తుపాకులతో చెలరేగిపోయారు. 26 మందిని మతం పేరుతో చంపేశారు. ఈ సంఘటన భారత్‌తో పాటు ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ మారణహోమాన్ని భారత ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. గంటల వ్యవధిలో పాకిస్థాన్‌కు సింధు జలాలను నిలిపివేసింది. అంతేకాకుండా అటారీ సరిహద్దు మూసేసింది. పాకిస్థానీయులకు వీసాలను రద్దు చేసింది. ఇక మే 7న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో 100 మంది ఉగ్ర వాదులు హతమయ్యారు. పాక్ వైమానిక స్థావరాలు ధ్వంసం అయ్యాయి.
ఇది కూడా చదవండి: Ghalib al-Rahwi: ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడి.. హౌతి ప్రధాని మృతి?
తాజాగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై ఇండియా టుడే-సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ప్రజల నుంచి ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ వచ్చింది. మెజారిటీ ప్రజలు ఆపరేషన్ సిందూర్‌ను సమర్థించగా.. 21 శాతం మంది బలహీనంగా ఉందని తెలియజేశారు.
ఇది కూడా చదవండి: Kurnool: ప్రేమ జంటలే టార్గెట్.. డబ్బులు, బంగారం దోపిడీ!
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతి స్పందనగా ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మంచి నిర్ణయమేనని 55 శాతం మంది సమర్థించారు. 21 శాతం మంది మాత్రం వ్యతిరేకించారు. ఇంకో 15 శాతం మంది మాత్రం సంతృప్తికరంగా లేదని.. పొరుగు దేశాన్ని మరింత ఎక్కువ కాలం శిక్షించాల్సి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. జూలై 1 నుంచి ఆగస్టు 14, 2025 వరకు ఈ సర్వేను నిర్వహించారు. 54,000 మందికి పైగా వ్యక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఇక 1,52,038 మంది ఇంటర్వ్యూలను కూడా విశ్లేషించారు. ఇలా మొత్తంగా 2,06,826 మంది నుంచి ఫలితాలను రాబట్టింది.
ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా నిర్వహించిన దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు చనిపోయారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించారు. ఉగ్రవాదులంతా జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-తైబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలకు చెందినవారుగా పేర్కొన్నారు. వీరికి పాకిస్థాన్ సైన్యం, ఐఎస్ఐ మద్దతు ఉందని తెలిపారు. మే 10న పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) భారత DGMOని సంప్రదించి సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారని.. మే 12న ఇద్దరు DGMOల మధ్య జరిగిన అధికారిక చర్చల తర్వాత కాల్పుల విరమణ జరిగినట్లుగా రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు.
అయితే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించినట్లు ట్రంప్ ప్రకటించారు. కాల్పుల విరమణ చేయకపోతే వాణిజ్య ఒప్పందం చేసుకోనని బెదిరించానని.. 5 గంటల్లోనే కాల్పుల విరమణ ప్రకటించారని చెప్పారు. అయితే ట్రంప్ ప్రకటనను భారత ప్రభుత్వం ఖండించింది. ఇరు దేశాల చర్చల తర్వాతే కాల్పుల విరమణ జరిగినట్లుగా భారత్ క్లారిటీ ఇచ్చింది.
