Amandeep Kaur: ఇన్‌స్టాగ్రామ్ ఫేమ్ పంజాబ్ లేడీ కానిస్టేబుల్ అమన్‌దీప్ కౌర్ 17.71 గ్రాముల నిషేధిత హెరాయిన్ డ్రగ్‌తో పట్టుబడింది. ఆమెను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన ఒక రోజు తర్వాత గురువారం ఆమెను పంజాబ్ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. పంజాబ్ ప్రభుత్వం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ‘‘ యుధ్ నషేయన్ విరుధ్’’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో కౌర్ అరెస్ట్ జరిగింది.
బతిండాలోని బాదల్ ఫ్లై ఓవర్ సమీపంలో పోలీసులు, యాంటి నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ సంయుక్త ఆపరేషన్‌లో అమన్‌దీప్ కౌర్ పట్టుకున్నట్లు డీఎస్పీ హర్బన్స్ సింగ్ తెలిపారు. ‘‘ జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా మేము బాదల్ ఫ్లై ఓవర్ కింద ప్రాంతాన్ని చుట్టుముట్టాము. ఒక థార్ ఎస్‌యూవీ కారును ఆపి డ్రైవర్‌ని ప్రశ్నించాము. ఆమె అమన్‌దీన్ కౌర్. ఆమెతో పాటు జస్వంత్ సింగ్ అనే వ్యక్తి ఉన్నాడు. వాహనాన్ని తనిఖీ చేయగా, మాకు 17.71 గ్రాముల హెరాయిన్ దొరికింది’’ అని హర్బన్స్ సింగ్ తెలిపారు.
Read Also: Annamalai: బీజేపీ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న అన్నామలై..
‘‘ఇన్‌స్టా క్వీన్’’ అమన్‌దీప్ కౌర్:
సోషల్ మీడియాలో అమన్‌దీప్ కౌర్‌కి చాలా ఫాలోయింగ్ ఉంది. “పోలీస్_కౌర్‌దీప్”తో ఇన్‌స్టాలో రీల్స్ చేస్తుంటుంది. పోలీస్ యూనిఫాం, ఫ్యాన్సీ వాచ్, గ్లాసెస్ పెట్టుకుని పంజాబీ సాంగ్స్‌తో రీల్స్ చేస్తుంటుంది. ఆమెకు ఇన్‌స్టాలో 37,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. అంతకుముందు ‘‘యూనిఫాంలో మోడలింగ్’’ చేస్తున్నట్లు చూపించే కంటెంట్ పోస్ట్ చేయవద్దని పోలీస్ డిపార్ట్మెంట్ ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే గుర్మీత్ కౌర్ అనే మహిళ అమన్‌దీప్ కౌర్ ఆడంబర లైఫ్ స్టైల్ గురించి ప్రశ్నించింది. ఆమెకు రూ. 2 కోట్ల విలువైన ఇళ్లు, రెండు కార్లు, లక్షల విలువైన వాచ్ ఉందని ఆరోపించారు. ఒక ఫేస్ బుక్ వీడియాలో తన భర్త, అంబులెన్స్ డ్రైవర్ అయిన బల్విందర్ సింగ్‌తో అమన్‌దీప్ కౌర్ రిలేషన్‌లో ఉందని గుర్మీత్ సింగ్ ఆరోపించింది. అమన్‌దీప్ కౌర్, బల్విందర్ సింగ్ కలిసి డ్రగ్స్ అమ్మేందుకు అంబులెన్స్‌ని ఉపయోగించినట్లు ఆమె ఆరోపించింది. ప్రస్తుతం కౌర్ పట్టుబడటంతో విచారణ ప్రారంభమైది. ఈ డ్రగ్స్ ఎలా వచ్చాయనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.