NTV Telugu Site icon

Crooked Thief: బొమ్మతుపాకీ చూపించాడు.. అడ్డంగా బుక్కై తన్నులు తిన్నాడు

Bank Roberry

Bank Roberry

Crooked Thief: పాపం లేత దొంగ బొమ్మతుపాకీ చూపించి దోచేద్దాం అనుకున్నాడు. ఓ సినిమా స్టైల్లో దొంగతనం చేద్దామని అనుకున్నాడు. అదేనండి అజిత్ సినిమా తునివులో బొమ్మతుపాతీ చూపించి దోచేద్దామని అనుకున్నాడు. కానీ అది సినిమా అని మరిచిపోయాడు. ఆసినిమా స్టైల్లో దోపిడి చేద్దామని ఏకంగా బ్యాంక్‌కే వెళ్లాడు చివరికి స్థానికులు అతనిని పట్టుకుని దేహశుద్ది చేశారు. ఈఘటన తమిళనాడులోని ఓ బ్యాంకులో చోటుచేసుకుంది.

Read also: Revanth reddy: రేపటి నుంచే రేవంత్ రెడ్డి పాదయాత్ర.. పూర్తి షెడ్యూల్ విడుదల

తిరుపూర్ జిల్లా ధర్మాపురం కెనారా బ్యాంకులో రద్దీగా ఉంది. అక్కడకు ఒకడు వచ్చాడు. బ్యాంక్‌ పరిశరాలను అంతా గమనించాడు. అయితే బ్యాంక్‌ లో కాస్త రద్దీ తక్కువైంది. ఇదే సమయం అని భావించాడు. ఫేస్‌ కు మాస్క్‌ ధరించాడు. బొమ్మతుపాకీతో బ్యాంక్‌ లో కూర్చున్న వారిని ఆ బొమ్మతుపాకీ చూపించాడు. కొందరిని బెదిరించి ఒకరిపై గురిపెట్టాడు. అంతే సీన్‌ రివర్స్‌ అయ్యింది. డ్యూప్లికెట్ తుపాకీ, బాంబుతో బ్యాంక్ లోని కస్టమర్స్‌ భయపెట్టాడు. బోమ్మ తుపాకీ తిప్పుతున్న సమయంలో తుపాకి చేతినుండి కిందపడిపోవడంతో దొంగను వృద్ధుడు తన వద్దవున్న టవాల్‌ తో దొంగ చేతులను గట్టిగాపడ్డుకున్నాడు. అక్కడున్న వారందరూ ధైర్యం చేసి దొంగపై విరుచుకుపడ్డారు. దొంగను కిందపడేసి చితకొట్టారు. బ్యాంక్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటా హుటిన పోలీసులు బ్యాంక్‌ దగ్గరకు చేరుకున్నారు. దొంగను అదుపులో తీసుకున్నారు. ఈఘటన సీసీ టీవిలో రికార్డు కావడంతో ఈ సినిమా కథకాస్త వెలుగులోకి వచ్చింది. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి సురేష్ గా గుర్తించారు పోలీసులు. ఆన్‌లైన్‌లో బొమ్మ తుపాకీని కొనుగోలు చేసి, డమ్మీ బాంబును తయారు చేయడానికి రెడ్ టేప్‌తో చుట్టి, స్విచ్ బాక్స్‌ను ఉపయోగించి కిచెన్ టైమర్‌ను అంటించాడు. అయితే దొంగను పట్టుకోబోయిన ఆపెద్దాయన అతడిని నేలపై పడేయడంతో గాయపడ్డాడు. పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి సమగ్ర విచారణ చేపట్టారు పోలీసులు.
Anasuya: హాట్ అనసూయ… ఆడాళ్లకే కలగదా అసూయ