Site icon NTV Telugu

INS Satpura: అమెరికా పర్యటనలో భారత యుద్ధనౌక.. మొదటి వార్ షిప్ గా రికార్డ్

Ins Satpura

Ins Satpura

INS Satpura, Indian Warship’s Historic US Visit: భారత యుద్దనౌక ఐఎన్ఎస్ సాత్పురా అమెరికా పర్యటనలో చరిత్ర సృష్టించింది. ఓ భారత యుద్ధ నౌక అమెరికా పశ్చిమ తీరాన్ని చేరుకోవడం ఇదే మొదటిసారి. ఈ రికార్డును ఐఎన్ఎస్ సాత్పురా సొంతం చేసుకుంది. ఇండియాకు స్వాతంత్య్ర వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఐఎన్ఎస్ సాత్పురా ఈ చారిత్రాత్మక పర్యటన చేస్తోంది. అమెరికా పశ్చిమ తీరం కాలిఫోర్నియా లోని శాన్ డియాగోకు చేరుకుంది.

Read Also: Asia Cup 2022: అభిమానులు బీ రెడీ.. రేపటి నుంచే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాలు

75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందు నేవీ స్మారక పర్యటనల్లో భాగంగా శనివారం కాలిఫోర్నియాలోని శాన్ డియాగో పోర్టుకు చేరుకుంది ఐఎన్ఎస్ సాత్పురా. అక్కడే ప్రవాస భారతీయుల సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించనుంది. దాదాపుగా 6 ఖండాలు, మూడు మహా సముద్రాలను దాటుకుని 10 వేల నాటికన్ మైళ్ల దూరంలోని శాన్ డియాగో పోర్టుకు చేరింది.

ఐఎన్ఎస్ సాత్పురా.. స్వదేశీయంగా నిర్మించిన శివాలిక్ క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్. వజ్రోత్సవ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యూఎస్ నేవీ బేస్ లో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ 75 ఏళ్లలో భారత నేవీకి చెందిన ఓ వార్ షిప్ అమెరికాకు వెళ్లడం ఇదే తొలసారి.. ఇదే ఈ పర్యటనను ప్రత్యేకంగా మార్చింది. ఐఎన్ఎస్ సాత్పురా 6,000 టన్నుల గైడెడ్ మిస్సైల్ స్టెల్త్ ఫ్రిగేట్. ఇది గగనతలం, భూమి, నీటి అడుగున శత్రువులను వెతకడానికి.. శత్రువల టార్గెట్లను నాశనం చేయడానికి ఉద్దేశించబడింది. ఐఎన్ఎస్ సాత్పురా.. విశాఖ పట్నంలోని తూర్పు నౌకాదళం ఫ్రంట్ లైన్ యూనిట్.

Exit mobile version