కొన్నిసార్లు నిజం జీవితంలో కూడా సినిమాల్లో మాదిరిగానే జరుగుతుంటాయి. 2007లో షాహిద్ కపూర్-కరీనా కపూర్ నటించిన ‘జబ్ వి మెట్’ చిత్రం గుర్తుందా? ఆ చిత్రం ప్రేమికుల హృదయాలను గెలుచుకుంది. అచ్చం అదే సినిమా మాదిరిగా ఇండోర్‌లో జరిగింది. అసలేం జరిగింది. ఓ ప్రేమికురాలు.. ప్రియుడి కోసం నుంచి పారిపోయి ఏం చేసింది. చివరిగా ఆమె తీసుకున్న నిర్ణయం అచ్చం సినిమా మాదిరిగానే దర్శనమిస్తోంది.
శ్రద్ధా తివారీ అనే యువతి.. సార్థక్ అనే యువకుడిని ప్రేమించింది. అతడితో జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయం తీసుకుంది. అంతే ఆగస్టు 23న ఇంట్లో నుంచి పారిపోయి ఇండోర్ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. కానీ అక్కడ సార్థక్ కనిపించలేదు. చాలా సేపు అతడి కోసం నిరీక్షించింది. కొంత సమయానికి సార్థక్ ఫోన్ చేసి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని.. స్టేషన్‌కు రావడం లేదని చెప్పాడు. దీంతో నిశ్చేష్టురాలైపోయింది. ప్రియుడి మాటలతో ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. భవిష్యత్ గురించి చాలా ఆందోళన చెందింది. చాలా సేపు బాధపడింది. కానీ అధైర్యపడలేదు. ధైర్యం తెచ్చుకుంది. గమ్యమేంటో తెలియదు గానీ.. స్టేషన్‌లో ఆగి ఉన్న రైలును ఎక్కేసింది. అనంతరం రత్లాం రైల్వే స్టేషన్‌లో దిగి ఒక చోటన మనోవేదనతో కూర్చుంది.
ఇది కూడా చదవండి: PM Modi: జపాన్ బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణించిన మోడీ
ఇక రత్లాం స్టేషన్‌లో ఇండోర్ కళాశాలలో పని చేసే ఎలక్ట్రీషియన్ కరణ్‌దీప్ కనిపించాడు. శద్ధా తివారీని చూసిన కరణ్‌దీప్.. ఒంటరిగా కూర్చోవడం చూసి పలకరించాడు. ఏం జరిగిందని వివరాలు అడిగాడు. జరిగిందంతా అతడికి చెప్పింది. దీంతో అతడు ఇంటికి వెళ్లిపోవాలని.. తల్లిదండ్రులు చెప్పింది వినాలని సలహా ఇచ్చాడు. కానీ అతడి మాటలను పట్టించుకోలేదు. పెళ్లి చేసుకోవాలని ఇంట్లో నుంచి వచ్చేశాను.. తిరిగి వెళ్తే చంపేస్తారని వాపోయింది. అయినా కూడా ఆమెను ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. పదే పదే ఆమెతో వాదించాడు. ఆమె మాత్రం పెళ్లి చేసుకోవాలని స్ట్రాంగ్‌గా నిలబడిపోయింది. దీంతో కరణ్‌దీప్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. తానే పెళ్లి చేసుకుంటాని చెప్పాడు. వెంటనే శ్రద్ధా అంగీకరించింది.
ఇది కూడా చదవండి: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై సర్వే.. ప్రజలు షాకింగ్ రెస్పాన్స్
అనంతరం ఇద్దరూ కలిసి మహేశ్వర్-మండలేశ్వర్‌కి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. అక్కడ నుంచి మందసౌర్‌కు వెళ్లి కాపురం పెట్టారు. ఇంతలో శ్రద్ధా తండ్రి అనిల్ తివారీ ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టాడు. కుమార్తె సమాచారం ఇస్తే రూ.50,000 రివార్డు ఇస్తానని ప్రకటించాడు. రహదారులపై పోస్టర్లు అతికించాడు. ఇక గురువారం నాడు శ్రద్ధా.. తండ్రికి ఫోన్ చేసి మందసౌర్‌లో సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. దీంతో అతడు ఊపిరి పీల్చుకున్నాడు. రాత్రికి హోటల్‌లో బస చేసి మరుసటి రోజు ఇంటికి రావాలని కోరాడు. అయితే హోటళ్ల వారు గది ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో రైలు టికెట్లు కొనేందుకు కరణ్‌దీప్‌కు అనిల్ డబ్బులు పంపించాడు. జంట ఇండోర్‌కు చేరుకున్నాక ఎంఐజీ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. ఇద్దరినీ ప్రశ్నిస్తున్నట్లు ఇండోర్ అదనపు డీసీపీ రాజేష్ దండోటియా తెలిపారు.
ఇక తన కూతురు తిరిగి రావడం సంతోషంగా ఉందని అనిల్ తివారీ తెలిపారు. అయితే శ్రద్ధా, కరణ్‌దీప్‌లను 10 రోజుల పాటు దూరంగా ఉంచుతానని.. అప్పటికీ ఇద్దరూ కలిసి జీవించాలని పట్టుబడితే.. తమ కుటుంబం వివాహం జరిపిస్తుందని అనిల్ తివారీ పేర్కొన్నాడు.
