Indigo Airlines: ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు హల్‌చల్ సృష్టించాడు. విమానం గాల్లో ఉండగానే.. ఎమర్జెన్సీ డోర్ తెరువబోయాడు. సిబ్బంది అతడ్ని అడ్డుకోబోయినా.. అందరినీ తోసుకుంటూ డోర్ తీసేందుకు ప్రయత్నించాడు. ఇతని చర్యతో విమానంలో ఉన్న ప్రయాణికులందరూ భయబ్రాంతులకు గురయ్యారు. జరగరానిది ఏమైనా జరుగుతుందేమోనని ఆందోళన చెందారు. చివరికి సిబ్బంది అతడ్ని అదుపు చేసి, పైలెట్‌కు సమాచారం అందించారు. దీంతో.. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Marriage Fraud: నిత్య పెళ్లికొడుకు అరెస్ట్.. పెళ్లి పేరుతోనూ పలువురిని మోసం
నాగ్‌పూర్ నుంచి ముంబైకి ఇండిగో ఎయిర్‌లైన్స్‌కి సంబంధించిన ఓ విమానం బయలుదేరింది. అప్పటివరకూ ఆ ప్రయాణికుడు తన సీట్లో కుదురుగా కూర్చున్నాడు. కానీ.. ఎప్పుడైతే ముంబై ఎయిర్‌పోర్ట్ సమీపించిందో, ల్యాండింగ్‌కి సమయం ఆసన్నమైందో, అప్పుడు ఆ ప్రయాణికుడు హంగామా మొదలుపెట్టాడు. ఉన్నట్లుండి తన సీటులో నుంచి లేచి, ఎమర్జెన్సీ డోర్ వైపు దూసుకెళ్లాడు. అతడ్ని ఆపేందుకు ప్రయత్నించినా.. అందరినీ తోసుకుంటూ వెళ్లిపోయాడు. డోర్ దగ్గరికి వెళ్లి, దాన్ని తెరించేందుకు ప్రయత్నించాడు. ఇంతలో సిబ్బంది అతడ్ని అదుపు చేసి.. పైలెట్‌కు సమాచారం అందించారు. పైలెట్ అతడ్ని బంది చేశాడు. ఆ ప్రయాణికుడు చేసిన ఈ పనికి.. విమానంలో ఉన్న ప్రయాణికులందరూ భయాందోళనలకు గురయ్యారు. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యాక.. ఆ ప్రయాణికుడ్ని హెచ్చరించి, సిఐఎస్ఎఫ్ భద్రతా బలగాలకు అప్పగించారు.
LoanApp Harassment: లోన్‌యాప్ వేధింపులకు మరో వ్యక్తి బలి.. భార్యకి మార్ఫింగ్ ఫోటోలు పెట్టి..
ఇలాంటి ఘటనలు జరగడం ఇదేం తొలిసారి కాదు. గతేడాది డిసెంబర్ 10వ తేదీ కూడా ఓ ప్రయాణికుడు ఇలాగే రచ్చ చేశాడు. చెన్నై – తిరుచిరాపల్లి విమానంలో ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు. అయితే.. అప్పటికీ విమానం ఇంకా టేకాఫ్ కాకపోవడంతో, ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోలేదు. తాను పొరపాటుగా ఆ తలుపు తెరిచానని, అందుకు క్షమాపణలు చెప్తున్నానని తేజస్వి సూర్య అనే ప్రయాణికుడు చెప్పాడు. అతను చేసిన ఆ చర్య వల్ల విమానం రెండు గంటలు ఆలస్యం అయ్యింది.
Volodymyr Zelenskyy: ట్విస్ట్ ఇచ్చిన జెలెన్‌స్కీ.. రష్యాకి ఊహించని దెబ్బ
