Site icon NTV Telugu

Indigo Crisis: ప్రయాణికులకు ఇండిగో స్పెషల్ ఆఫర్.. రూ.10వేల ట్రావెల్ వోచర్ ప్రకటన

Indigo

Indigo

ఇండిగో సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులకు ఎయిర్‌లైన్ సంస్థ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. డిసెంబర్ 3-5న ఎయిర్‌పోర్టుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు రూ.10,000 ట్రావెల్ వోచర్లు ప్రకటించింది. 12 నెలల లోపు ఎప్పుడైనా ఈ వోచర్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అయితే కస్టమర్లను ఎలా గుర్తి్స్తారో మాత్రం వెల్లడించలేదు. ఇదిలా ఉంటే ఇప్పటికే రూ.610 కోట్ల రీఫండ్ ప్రయాణికులకు ఇండిగో సంస్థ చెల్లించింది. తాజాగా రూ.10,000 ట్రావెల్ వోచర్‌ను ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Trump: గోల్డ్ కార్డు ఎవరి కోసం? భారతీయ విద్యార్థులనుద్దేశించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు

గత వారం నుంచి ఇండిగో సంక్షోభం తలెత్తింది. ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిండి తిప్పలు లేకుండా విమానాశ్రయాల్లోనే కాలం గడిపారు. దీంతో ప్రయాణికులు నరక యాతన పడ్డారు. దీంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రస్తుతం నెమ్మది.. నెమ్మదిగా పరిస్థితులు చక్కబడుతున్నాయి.

ఇది కూడా చదవండి: Starlink India: భారత్‌లో త్వరలోనే ‘స్టార్‌లింక్’ సేవలు.. ఎదురుచూస్తున్నా అంటూ ఎలాన్‌ మస్క్‌ ట్వీట్!

Exit mobile version