Site icon NTV Telugu

IndiGo Incident: పాకిస్తాన్ వల్ల 220 మంది ప్రాణాలు గాలిలో కలిసేవే.. నిమిషంలో 2.5 కి.మీ కిందకు పడిపోయిన విమానం..

Indigo

Indigo

IndiGo Incident: బుధవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విపరీతమైన వడగళ్ల వాన, దట్టమైన మేఘాల్లో చిక్కుకున్న విమానం అత్యంత కఠిన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరకు పైలట్లు విజయవంతంగా విమానాన్ని శ్రీనగర్‌లో ల్యాండ్ చేయడంతో అందులోని 220 మంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదకరమైన వాతావరణం నుంచి బయటపడటానికి ఇండిగో పైలట్లు లాహోర్ ఏటీసీని సంప్రదించినప్పటికీ, పాకిస్తాన్ తమ ఎయిర్‌స్పేస్ ఉపయోగించుకోవడానికి అనుమతించలేదు. పాకిస్తాన్ తీరు వల్ల 220 మంది ప్రాణాలు కోల్పోయే స్థితికి వచ్చింది.

Read Also: Covid-19: తొమ్మిది నెలల శిశుకుకు కోవిడ్-19 పాజిటివ్..

డీజీసీఏ ప్రాథమిక అంచనా ప్రకారం, విమానం తన యాంగిల్ ఆఫ్ అటాక్(AOA) లోపంతో ఉండగా, విమానంలోని నియంత్రణ వ్యవస్థలు వైఫల్యానికి గురవుతూ వచ్చాయి. ఈ గందరగోళం మధ్య ఆటోపైలెట్ కూడా పడిపోయింది. దీంతో, సిబ్బంది పూర్తిగా మాన్యువల్ కంట్రోల్‌లోనే విమానాన్ని నియంత్రించాల్సి వచ్చింది. ఒక దశలో నిమిషానికి 8,500 అడుగుల వేగంతో వేగంగా దిగింది, ఇది సాధారణంగా నిమిషానికి 1,500-3,000 అడుగుల వేగం కంటే చాలా ఎక్కువగా ఉంది.. ఆ సమయంలో విమానం తన గరిష్ట వేగం, మాక్ నెంబర్‌ని చేరుకుందనే ‘స్టాల్’ వార్నింగ్స్ వచ్చాయి. పైలట్ల మాన్యువల్ ఫ్లయింగ్ నైపుణ్యాలతో విమానాన్ని స్థిరంగా ఉంచారు.

ఇదిలా ఉంటే, విపతీరమైన వడగళ్ల వాన, టర్బులెన్స్ విమానాన్ని చుట్టుముట్టాయి. దీంతో విమానం నిమిషానికి 8500 అడుగుల వేగంతో కిందకు దిగింది. విమానం 36,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు విమానం ఈ గందరగోళ పరిస్థితుల్లో చిక్కుకుంది. పాకిస్తాన్ స్వల్పకాలం తమ గగనతలాన్ని వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఢిల్లీకి తిరిగి వెళ్లాలని పైలట్లు అనుకున్నారు. అయితే, అప్పటికే మేఘాలు సమీపించడంతో, దట్టమైన మేఘాల గుండానే శ్రీనగర్ వైపు వెళ్లాలని సిబ్బంది నిర్ణయం తీసుకుంది. ఈ ప్రమాదంలో విమానం ముక్కు భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఫోటోలు చూపిస్తున్నాయి.

Exit mobile version