NTV Telugu Site icon

Indigo Flight: ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం

Indigo Flight

Indigo Flight

Indigo Flight: ఈ మధ్య కాలంలో విమానాల ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. అయితే విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి కానీ ప్రాణనష్టం జరడం లేదు. మొన్న టోక్యో నగరంలో రెండు విమానాలు ఒకేసారి ఒకే రన్‌వే పైకి రావడంతో తాత్కాలికంగా రన్‌వేను నిలిపివేశారు. అంతకుముందు ట్రయినింగ్‌ విమానం కూలిపోయింది. కొద్ది రోజుల క్రితం శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలు దేరిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా ల్యాడింగ్‌ చేయాల్సి వచ్చింది. ఇపుడు ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ సమయంలో విమానానికి సంబంధించిన తోకభాగం నేలకు తాకింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేయగలిగారు.

Read also: Adipurush: థియేటర్లో ఆదిపురుష్ సినిమా చూసేప్పుడు పాటించాల్సిన నియమాలివేనట.. వైరల్ అవుతున్న వాట్సాప్ మెసేజ్!

ఇండిగో విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్ పోర్టులో విమానం ల్యాండింగ్‌ సమయంలో దాని తోక భాగం నేలకు తాకింది. సమయానికి అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్‌ చేయగలిగారు. కోల్ కతా – ఢిల్లీ ఇండిగో వీటీ-ఐఎంజీ విమానం జూన్ 11వ తేదీన కోల్ కతా నుంచి వచ్చింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా.. ప్రమాదవశాత్తు దాని తోక భాగం రన్ వేపై నేలను తాకింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదని.. ప్రయాణీకులకు ఎవరికి గాయాలు కూడా కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో విమానం కొంత భాగం దెబ్బతినడంతో సర్వీసులను నిలిపివేయాల్సి వచ్చిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలో ల్యాండ్ అయ్యేంత వరకు విమానంలో ఎలాంటి సమస్యా తలెత్తలేదని తెలిపింది. రన్ వేపైకి చేరుకునే సమయంలో సాధారణం కంటే భిన్నంగా విమానం కదులుతున్నట్లు పైలెట్లు గుర్తించినట్లు పేర్కొంది. వెంటనే జాగ్రత్తగా పైలెట్లు ల్యాండింగ్ చేయగలిగారు.