బడ్జెట్ క్యారియర్ ఇండిగో ‘వాక్సి ఫేర్’ అంటూ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. కోవిడ్-19 వ్యాక్సిన్‌లలో ఫస్ట్, సెకండ్ డోస్‌లను తీసుకున్న ప్రయాణీకులకు బేస్ ఫేర్‌పై 10 శాతం తగ్గింపును అందిస్తోంది. భారతదేశంలో ఉన్న టీకాలు వేసుకున్న ప్రయాణికులు ఈ ఆఫర్‌ను పొందవచ్చు. మహమ్మారి మధ్య విమాన ప్రయాణాన్ని పెంచే ప్రయత్నంలో ఈ చర్య తీసుకున్నారు. ఇండిగో తాజాగా ట్విట్టర్‌లో “అందరూ టీకాలు వేసుకొని ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారా? వాక్సి ఫేర్‌తో బుక్ చేసుకోండి, మీ ట్రిప్‌ను సద్వినియోగం చేసుకోండి” అని ఎయిర్‌లైన్ తెలిపింది. ప్రయాణీకులు తమ కోవిడ్-19 టీకా సర్టిఫికేట్‌ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
లేకుంటే ఎయిర్‌పోర్ట్ చెక్-ఇన్ కౌంటర్‌లో ఆరోగ్య సేతు మొబైల్ యాప్‌లో వారి టీకా తీసుకున్నట్లు చూపించాలి. లేని పక్షంలో ఛార్జీ మరియు మార్పు రుసుములో వర్తించే వ్యత్యాసం ఛార్జ్ చేయబడుతుంది. అవసరమైన టీకా ధృవీకరణ పత్రాన్ని అందించడంలో విఫలమైన ప్రయాణీకులకు విమానయాన సంస్థ బోర్డింగ్ నిరాకరించవచ్చు. ఇండిగో వెబ్‌సైట్‌లో టిక్కెట్‌ను బుక్ చేసుకోవడం ద్వారా మాత్రమే ప్రయాణీకులు ఈ ఆఫర్‌ను పొందగలరు. వెబ్‌సైట్ ప్రకారం, టిక్కెట్‌లను బుక్ చేసుకున్న తేదీ నుండి 15 రోజుల కంటే ఎక్కువ ప్రయాణానికి వాక్సి ఫేర్ తగ్గింపు వర్తిస్తుంది.
