NTV Telugu Site icon

Aditya-L1: కీలక మైలురాయిని దాటిన ఆదిత్య ఎల్1.. భూమి ప్రభావాన్ని తప్పించుకుని ఎల్1 దిశగా ప్రయాణం..

Aditya L1

Aditya L1

Aditya-L1: భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్ 1 సోలార్ మిషన్ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఆదిత్య ఎల్ 1 అనుకున్నట్లుగానే గమ్యం దిశగా పయణిస్తోంది. తాజాగా భూమి ప్రభావాన్ని తప్పించుకుని ముందుకు సాగుతున్నట్లుగా ఇస్రో వెల్లడించింది. ‘స్పియర్ ఆఫ్ ఎర్త్ ఇన్ఫూయెన్స్’ దాటినట్లుగా తెలిపారు. ఇప్పటి వరకు 9.2 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి భూమి ప్రభావం ఉండే ఈ ప్రాంతాన్ని దాటేసిందని ఇస్రో వెల్లడించింది. భూమి, సూర్యుడికి మధ్యలో ఉండే లాంగ్రేజ్ పాయింట్(L1) దిశగా వెళ్తోంది.

ఇస్రో చేపట్టిన ప్రయోగాల్లో రెండు స్పేస్ క్రాఫ్టులు మాత్రమే ఎర్త్ ఇన్ఫూయెన్స్ ని దాటి వెళ్లాయి. అందులో ఒకటి ‘మంగళయాన్’ కాగా, రెండోది ఆదిత్య ఎల్ 1. అనుకున్న మార్గంలోనే ఎల్ 1 పాయింట్ వద్దకు ఆదిత్య ఎల్ 1 పయణిస్తోందని ఇస్రో ఎక్స్(ట్విట్టర్)లో తెలిపింది.

Read Also: Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపడతాం..

సెప్టెంబర్ 2న శ్రీహరికోట రాకెట్ స్టేషన్ నుంచి పీఎస్ఎల్వీ ద్వారా ఆదిత్య ఎల్1 అంతరిక్షంలోకి వెళ్లింది. భూమి గురుత్వాకర్షణ శక్తి నుంచి బయటపడి తగిన వేగం పొందేందుకు పలుమార్లు భూమి చుట్టూ దీర్ఘవృత్తాకారంలో చక్కర్లు కొట్టింది. దశల వారీగా ఆదిత్య ఎల్ 1 అన్ బోర్డ్ ఇంజన్లను మండించి శాస్త్రవేత్తలు కక్ష్యను మార్చారు. అనుకున్న వేగం సాధించిన తర్వాత ఎల్1 పాయింట్ వద్దకు ప్రయాణం మొదలుపెట్టింది.

ఎల్1 పాయింట్ సూర్యుడికి, భూమికి మధ్య ఉండే ఓ పాయింట్. ఇక్కడ సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తులు బ్యాలెన్స్ అవుతుంటాయి. ఈ కక్ష్యలో ఆదిత్య ఎల్1 స్థిరంగా ఉంటుంది. ఎల్1 పాయింట్ వద్ద హాలో కక్ష్యలో తిరుగుతుంది. ఈ పాయింట్ భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది.