Site icon NTV Telugu

Longest Sea Bridge: ఇండియాలో “అత్యంత పొడవైన సముద్ర వంతెన”.. జనవరి 12న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం..

Longest Sea Bridge

Longest Sea Bridge

Longest Sea Bridge: దేశంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెనను జనవరి 12న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. లాంగెస్ట్ సీ బ్రిడ్జ్‌గా పేరొందిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్(ఎంటీహెచ్ఎల్)ని ప్రధాని ప్రారంభించనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆదివారం తెలిపారు. ముంబైలోని సెవ్రీని, రాయ్‌గఢ్ జిల్లాలోని నవ షేవా ప్రాంతాన్ని ఈ బ్రిడ్జ్ ద్వారా అనుసంధానించనున్నారు. మొత్తం 21.8 కిలోమీటర్ల ఈ వంతెన ప్రయాణాన్ని రెండు గంటల నుంచి కేవలం 15-20 నిమిషాలకు తగ్గిస్తుందని సీఎం ఏక్‌నాథ్ షిండే చెప్పారు.

Read Also: XPoSat: న్యూ ఇయర్ రోజే ఇస్రో ‘‘ఎక్స్‌పోశాట్’’ ప్రయోగం.. మిషన్ లక్ష్యాలు ఇవే..

ఈ వంతెన ఆయా ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధిని తీసుకువస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ద్వారా ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్ వేని మరింత అనుసంధానించినట్లు అవుతుంది. దీని ద్వారా మహారాష్ట్రలోని రెండు పెద్ద నగరాలైన ముంబై-పూణేలను కలుపుతుందని అధికారులు చెబుతున్నారు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింగ్ మొత్తం 6 లేన్ల రహదారి. ఇది సముద్రంపై 16.50 కిలోమీటర్ల పొడవు ఉండగా.. నెలపై 5.50 కిలోమీటర్ల పొడవు ఉంది.

Exit mobile version